Thursday, March 28, 2024

టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్ పదవీకాలం పొడిగింపు..

టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ పదవీకాలం పొడిగిస్తూ కంపెనీ బోర్డు శుక్రవారం నిర్ణయం తీసుకుంది. దీంతో మరో ఐదేళ్లపాటు టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ కొనసాగనున్నారు. 2017లో ఆయన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఐదేళ్లపాటు ఆయన తన బాధ్యతలను సమర్థంగా నిర్వహించారు. ఈయనకు ముందు సైరస్‌ మిస్త్రీ చైర్మన్‌గా ఉండగా బోర్డు తొలగించడంతో టీసీఎస్‌ బాధ్యతలు చంద్రశేఖరన్‌ స్వీకరించారు. టీసీఎస్‌లో సామర్థాన్ని నిరూపించుకున్న ఆయనకు ఇన్వెస్టర్లు, వ్యాపార భాగస్వాముల నుంచి కూడా మంచి ఆదరణ లభించింది.

కాగా ఎయిరిండియాను మళ్లి టాటా యాజమాన్యం సొంతం చేసుకోవడంలో చంద్రశేఖరన్‌ కీలకపాత్ర పోషించారు. టాటా మోటార్స్‌ను సమర్థంగా నిర్వహించేందుకు ఆయన చేసిన కృషి సత్ఫలితాలును ఇచ్చింది. చంద్రశేఖరన్‌ ఐదేళ్ల పదవీకాలంలోనే టాటా గ్రూప్‌ కంపెనీల మార్కెట్‌ విలువ భారీగా పెరిగింది. 2017 ఫిబ్రవరినాటితో పోలిస్తే టాటా గ్రూప్‌ కంపెనీల మార్కెట్‌ విలువ 199శాతం పెరిగి 23.8లక్షల కోట్లకు చేరింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement