Sunday, May 12, 2024

”మౌనమే అత్యుత్తమ ఉపదేశం”

”భగవంతుడిని అంతర్నేత్రంలో దర్శించడానికి ఉత్తమమైన ఆధ్యాత్మిక మార్గం మౌనం అని” తన జీవితం ద్వారా రుజువుచేసిన ఆధ్యాత్మిక సంపన్నులు భగవాన్‌ రమణ మహర్షి.మౌనం ద్వారానే ఆత్మజ్ఞానాన్ని, చిత్తశాంతిని భక్తులకు అనుగ్రహించిన దివ్యజ్యోతి స్వరూపులు రమణ మహర్షి. నిశ్శబ్దాన్ని ఆశ్రయంగా చేసుకుని మౌన సాధనవల్లే ఈశ్వర సాక్షాత్కారమవుతుందంటారు. ”అత్యుత్తమ జ్ఞాన సాధన మౌనం” అని ఎల్లవేళలా బోధించిన రమణ మహర్షి మహా నిర్యాణం చెందిన రోజు నేడు.
”గురువు అనుగ్రహానికి ఉత్తమోత్త మ రూపం మౌనమే. అదే అ త్యుత్తమ ఉపదేశం. మౌనంలో నే సాధకుని ప్రార్థన పరాకాష్టకు చేరు తుంది. గురువు మౌనంలో ప్రతిష్ఠితుడైతే, సాధకుని మనస్సు దానంతట అదే విశుద్ధిని పొందుతుంది” అన్నది రమణుల మౌన బోధ. భగవాన్‌ రమణ మహర్షిని ఎన్నో ప్రశ్న లు అడగాలని అరుణాచలం వచ్చిన భక్తులు గంటల తరబడి మహర్షి సమక్షం లో మౌనంగా కూర్చునేవారు. వారిమధ్య మాటలు వుండవు. అడగాలనుకున్న ప్రశ్న లు అడగరు. మహర్షి సమాధానం చెప్పరు. అయితేనేం అప్రతిహతమైన శాంతిప్రవా హం అన్ని దిక్కుల నుండి వెల్లువలా వ్యా పించి మనస్సును శాంతితో నింపుతుంది. ఇదే రమణ మహర్షి దీర్ఘమౌనంలోని అంత రార్థం. ”నిన్ను నువ్వు తెలుసుకో. నువ్వు ఎవరో తెలిస్తే ఈ సమస్తం తెలుస్తుంది. దేహమే నేను అనే సంకుచిత భావనే అహానికి, ప్రారబ్ద కర్మకు కారణ మవుతుంది. జన్మజన్మల కర్మబంధానికి హేతువు అవుతుంది. ఒక్క సారి దేహభావన తొలగిందంటే కర్మబంధం పటాపంచలవుతుంది” ఇదే ఎల్లప్పుడూ ఆయన ఉపదేశం.
తన ఉనికి ద్వారానే భక్తుల జీవితాలలో వెలుగు నింపిన భగవాన్‌ రమ ణ మహర్షి 1879వ సంవత్సరం డిసెంబర్‌ 29వ తేదీ అర్థరాత్రి జన్మించారు. దక్షిణ భారతావనిలోని తమిళనాట తిరుచ్చుళీ క్షేత్రం. శివుని పంచమూర్తులలో నటరాజ ఆనందమూర్తి ఆవిర్భావాన్ని పుర స్కరించుకుని, జరుపుకున్న ఆరుద్ర దర్శనం’ అనే ఉత్సవ సందర్భం. శ్రీభూమినాథేశ్వర ఆలయ సంబంధ ఆలంకృత ఉత్సవ మూర్తులను రథంపై వీధులగుండా ఊరేగించిన ఉత్సవ సమయం. అర్థరాత్రి దాటా క డిసెంబర్‌ 30నాటి తొలి గంటలో కోవెలను ఆనుకుని ఉన్న ఇంటిలో ఒక మగ శిశువు జన్మించాడు. సుందరం అయ్యర్‌, ఆళగమ్మ దంపతు లకు కలిగిన ఆ బాలునికి .. ‘వేంకటేశ్వరన్‌’ అని పేరు పెట్టారు. ఆ బాలుడే తర్వాతి కాలాన ‘భగవాన్‌ రమణ మ#హర్షి’ అని ఖ్యాతి గడించాడు. బాలుని బాల్యం సాధారణంగా సాగింది. తండ్రి మందలింపుతో పక్క గుడిలో జగన్మాత విగ్ర#హం వెనుక దాగి ఉన్నాడు. తెలియని వయసు లో ప్రాపంచిక సంకటాల నుండి ఉపశమన లక్ష్యంతో దైవసన్నిధిని ఆశ్ర యించడం భవిష్యత్‌ జీవితానికి సంకేతం. శివునికి ధన ప్రాణమానా లను సమర్పించిన 63 నాయనార్ల గాథల పట్ల దివ్యావేశానికిలోనై, త్యాగభరితమై సాయుజ్యానికి దారితీసే గాథలకు పరవశుడై, సాధు మార్గ అన్వేషి అయినారు. నాటినుండి ఆయనలో దివ్య ప్రేరణ కలి గింది. రామస్వామి అనే వ్యక్తిని ఎక్కడ నుండి వస్తున్నారని ప్రశ్నించి, ‘అరుణాచలం’ నుండి అని సమాధానం పొందగా, ఆయన ఏదో తెలి యని అనుభూతికి లోనైనారు. నాటి నుండి ప్రాపంచిక విష యాల పట్ల విముఖులు కావడం ప్రారంభ మైది. 1896 ఆగస్టు 29న చదువుల పట్ల నిరాసక్తత కలిగి, ఇల్లు వదిలి స్కూల్‌ ఫీజుకు 5 రూపాయలు అన్న వద్ద తీసుకుని, ఉదాత్తమైన ఆశయ సాధన కోసం వెళుతున్నానని 3 రూపాయలు వెంట ఉంచుకుని, లేఖ వదిలి వెళ్ళి, దైవ మార్గ నిర్దేశత్వంతో, కష్ట నష్టాల కు ఓర్చి, సుదీర్ఘ ప్రయాణానంతరం సెప్టెంబర్‌ 1న అరుణోదయ వేళలో అరుణాచలంలో మంగళప్రద మంగ ళ వారం మంచి ఘడియలో పాదం మోపి, ప్రాకార ద్వారాలు, గర్భాల యం సహా బార్లా తెరిచి ఉన్న శ్రీ అరుణాచలేశ్వర ఆలయ ప్రవేశం చేశా రు. మహా లింగాలింగనం ద్వారా ఆత్మ సమర్పణం చేసుకున్నారు. నాటి అరుణాచల ఆగమనం నుండి నేటి రమణాశ్రమంగా రూపుదిద్దుకున్న గిరి దక్షిణ పాదంలో స్థిరపడి, 1950, ఏప్రిల్‌ 14 మహా నిర్యాణం వర కు 54 ఏళ్ళు అరుణగిరి పొలిమేర దాటనే లేదు. స్వామి ఉనికిని గురించి తెలుసుకున్న తల్లి అళగమ్మ, ఇంటికి వెళదా మని అర్థించగా.. ”కర్త వారివారి ప్రారబ్ధానుసారం జీవులనాడించును. జరుగనిది ఎంత ప్రయత్నించినను జరుగదు. జరుగునది ఎవరెంత యడ్డుకున్నను జరుగనే జరుగును. ఇది సత్యము. కనుక మౌనముగ ఉండుటయే ఉత్త మము”… అని కాగితంపై రాయగా, ఆమె ఖిన్నవదనయై వెనుతిరిగా రు. రమణులు గిరిపై విరూపాక్ష గు#హలోనే 17 ఏళ్ళ వాసాన్ని గడి పారు. 1916లో రమణులు విరూపాక్ష నుండి స్కందాశ్రమానికి మారారు. అక్కడున్న తల్లికి వైరాగ్యాన్ని బోధించారు. 1920లో తల్లి ఆరోగ్యం క్షీణించగా, ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ, 22లో రమ ణుల #హస్త మస్తక సంయోగ దీక్ష ద్వారా అళగమ్మకు దే#హ విముక్తి కలిగించారు. ఆమెకు స్పృ#హ ఉన్నంత వరకు వేదాంత బోధ చేస్తూ, చివరగా తమ కుడి చేతిని ఆమె #హృదయం పైన, ఎడమ చేతిని శిరస్సు పైన ఉంచి, తదేక దృష్టితో వీక్షిస్తూ, మోక్షాన్ని ప్రసాదించారు. ఆమె పార్థివ శరీరాన్ని ద#హనం చేయకుండా, గిరి దక్షిణ పాదం లో సమాధి చేశారు. ఆ సమాధి చుట్టూ నిర్మాణాల సమాహారమే నేటి శ్రీరమణా శ్రమం. 1949 లో మ#హర్షుల ఎడమ మోచేతిపై సార్కమా (క్యాన్సర్‌) రాగా 1950, ఏప్రిల్‌ 14న స్వామి అంతిమ ఘడియలు సమీపించా యని గ్ర#హంచిన భక్తులు ‘అరుణాచల శివ’ అంటూ రమణ మ#హర్షి విరచితాలను నినదించగా, రాత్రి 8.47లకు దక్షిణాకాశంలో పెద్ద కాం తిగోళంమెరసి, ఈశాన్యంవైపు పయనించి, అరుణాచల శిఖరాన అంత ర్హితమైంది. రమ ణుల ఆధ్యాత్మిక శక్తి నానాటికీ భాసిస్తూనే ఉన్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement