Sunday, May 5, 2024

పూరీ జగన్నాథ ఆలయ విశిష్టత

ప్రపంచ ప్రఖ్యాత దివ్యధామం, పౌరాణిక మరియు చారిత్రక ప్రాధాన్యం కల పుణ్యక్షేత్రం, భారతదేశంలో గల ప్రముఖ వైష్ణవ క్షేత్రాలలో ముఖ్యమైనది మరియు చార్‌ధామ్‌లలో అత్యంత ప్రధానమైనది, అదే ఒడిషా రాష్ట్రంలో గల పూరీ దివ్య క్షేత్రం. ఇక్కడ శ్రీమహావిష్ణువు జగన్నాథుడి రూపంలో సోదరుడు బలభద్ర, సోదరి సుభద్రలతో కలసి కొలువు తీరి ఉన్నాడు.

పూరీ దేవాలయంలో మూల విరాట్‌ నుండి ప్రసాదం వరకు అంతా విశిష్టమే. దేవాలయాలలో మూలవిరాట్‌ విగ్రహాలు రాతితో మరియు ఉత్సవ విగ్రహాలు పంచలోహములతో త యారుచేయబడతాయి. కాని ఈ విశిష్ట దేవాలయంలో విగ్రహాలు చెక్కతో తయారు చేయబడతాయి. అదే విగ్రహాలు ఉత్సవమూర్తులుగా ఊరేగింపబడతాయి. ప్రసాదంగా ఇచ్చే అన్నం, పప్పు మొదలైనవి కుండలలో వండుతారు. ఇతర దేవాలయాలలో మాదిరిగా స్వామి తన దేవేరులతో కొలువై ఉండక, సోదరుడు బలభద్ర, సోదరి సుభద్రతో కొలువై ఉంటాడు. అందుకే ఈ ఆలయంసోదర ప్రేమకు ప్రతీకగా కీర్తి పొందింది.

ఆలయంలో చెక్క విగ్రహాల ప్రతిష్ట వెనుక అనేకానేక పురాణగాధలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒక కథనం ప్రకారం, ఉజ్జయిని పాలకుడైన ఇంద్రద్యుమ్నుడు అనే రాజుకు కలలో వి ష్ణుమూర్తి దర్శనమిచ్చి సముద్రంలో తేలియాడుచున్న వేపమానుతో జగన్నాథుని రూపంలో తన విగ్రహాన్ని చేయించమని కోరాడట. విగ్రహాలను చెక్కడానికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు ముందుకు వచ్చాడు. కాని తాను విగ్రహాలు చెక్కినపుడు ఎవరు లోపలికి రారాదని తలుపులు మూసుకున్నాడు. పదిహేను రోజులైనా శిల్పి బయటకి రాకపోవడంతో, అన్నపానీయాలు లేక ఆయన ఎక్కడ శుష్కించిపోతాడో అని భావించి, రాజమాత ఆదేశానుసారం తలుపులు తెరవగా, విగ్రహాలు అసంపూర్తిగా దర్శనమిచ్చాయి. శిల్పి అదృశ్యమైనాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శిల్పిగా వచ్చాడని భావించి, అసంపూర్తిగా ఉన్న ఆ విగ్రహాలనే రాజు ప్రతిష్టించాడని ప్రతీతి. అవయవ లోపం కలిగిన విగ్రహాలు అర్చనకు అనర్హం అని అంటారు. కానీ ఈ ‘నీలాచలం’ క్షేత్రంలో అదే ప్రత్యేకత. పూరీ జగన్నాథుడి రూపం దైవం చెక్కిన దారుశిల్పం.

ఆలయ నిర్మాణం:
జగన్నాథ ఆలయాన్ని 12వ శతాబ్ధంలో కళింగ పాలకుడైన అనంతవర్మన చోడ గంగాదేవ నిర్మించగా, ఆ తర్వాత కాలంలో అనంగ భీమదేవి పునర్నించాడని తెలుస్తోంది. ఆలయం మొత్తం కళింగ శైలిలో ని ర్మితమైనది.

పూరీ ఆలయం నాలుగు ల క్షల చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించబ డింది. సుమారు 120 ఉపాలయాలు ఉన్నాయి. అమోఘమైన శిల్ప సంపదతో భారతదేశలోని అద్భుత కట్టడాలలో ఒకటిగా చెబుతారు. ఆలయంలో విష్ణువుకు చెందిన ‘శ్రీచక్ర’ ఎనిమిది ఆకుల చక్రంగా నిర్మించబడింది. దీనినే ‘నీలిచక్ర’ అనికూడా అంటారు. ధ్వజస్తంభం ఎత్తైన రాతి దిమ్మపై నిర్మించబడింది. ఇది గర్భగుడి కన్నా ఎత్తులో ఉంటుంది. తూర్పు ముఖంగా ఉం డే ఆయల ముఖ ద్వారాన్ని సింహ ద్వారం అంటారు. మిగిలన మూడు పక్కల ఉన్న ద్వారాలని ‘హాథీ ద్వారా’ (ఏనుగు), ‘వ్యాఘ్రద్వార'(పులి), ‘అశ్వద్వార'(గుఱ్ఱ ం) లుగా పిలుస్తారు. ప్రధానమైన సింహద్వారం ‘బడోదండో’ గా పిలిచే పెద్ద వీధికి దారి చూపుతుంది. ‘బాయిసిపవచ’ అంటే 22 మెట్లు ఆలయ ముఖ ద్వారానికి దారి చూపుతాయి.

- Advertisement -

జగన్నాథుడు విష్ణువు రూపంగా కొలువుబడుచున్నాడు. కానీ ఈ ఆలయంలోని కొన్ని విగ్రహాలను శివ రూపమైన భైరవ, శివపత్ని విమలగా కొలుస్తారు. ఇక్కడ అమ్మవారు 17వ శక్తిపీఠ ం విమలదేవిగా పూజలందుకుంటోంది. పూరీ జగన్నాధ శ్రీక్షేత్ర సంస్కృతి సాంప్రదాయాలు హైందవంలో శివ-శక్తి-వైష్ణవ తత్వాలకు ప్రతీకగా నిలుస్తాయి. అందుకే ఈ క్షేత్రం భక్తుల నీరాజనాలందుకుంటోంది. ప్రతి హిందువు జీవింలో ఒక్కసారైనా దర్శించుకోవలసిన దివ్యక్షేత్రం పూరీ. అలాగే ఈ క్షేత్రం బౌద్ధ, జైన మతాల్లలోని అంశాల మేలు కలయికగా ఏర్పడినట్టు చెబుతారు. గణ గణ మ్రోగే గంటలు, 65వ అడుగుల ఎత్తయిన పిరమిడ్‌ నిర్మాణం, వివరంగా చెక్కబడిన గోడలు, కృష్ణుడు యొక్క జీవితాన్ని చిత్రీకరిస్తున్న స్తంభాలు అసంఖ్యాక భక్తులను ఆకర్షిస్తున్నాయి.

ఈ దేవాలయాన్ని భగవత్‌ శ్రీరామానుజాచార్యుల వారు, ఆదిశంకరాచార్యుల వారు వంటి ఎందరో మతాచార్యులు సందర్శించారు. జగన్నాథస్వామి ఎప్పుడు తన కళ్ళెదుటే కదలాడాలని స్తుతించారు శంకరాచార్యులు. శంకరాచార్యుల వారు ఇక్కడ గోవర్ధన పీఠాన్ని స్థాపిస్తే, రామానుజాచార్యులు ఎన్నో వైష్ణవ మఠాలను స్థాపించారు. గురునానక్‌, కబీర్‌, తులసీదాస్‌ కూడా ఈ ఆలయాన్ని దర్శించిన ఆధారాలున్నాయి.

పూరీ జగన్నాథుడి ఆలయ గోపురం అంచు మీద సుదర్శన చక్రం దర్శనమిస్తుంది. దీనిపై పసుపు జెండా ఎగురుతూ ఉంటుంది. దీనిలోని ఎరుపు రంగు జగన్నాథుడు ఆలయంలో ఉన్నాడని సూచిస్తుందని భావిస్తారు. ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తారు. ప్రతియేటా ‘అక్షయ తృతీయ’ రోజున జరిగే చందనయాత్ర రథాల నిర్మాణాన్ని మొదలుపెట్ట డాన్ని సూచిస్తుంది. జ్యేష్ఠ పౌర్ణమినాడు స్నానయాత్ర పేరుతో ప్రతిమలకు స్నానం చేయించి అలంకరిస్తారు. అలాగే వసంత కాలంలో ‘డోల యాత్ర’, వర్షాకాలంలో ‘ఝలన్‌ యాత్ర’ వేడుకలను నిర్వహిస్తారు. పంచాంగం ప్రకారం ప విత్రోత్సవం, దమనక ఉత్సవాన్ని జరుపుతారు. అలాగే కార్తీక, పుష్య మాసాలలో ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తారు.

రథయాత్ర

పూరీ జగన్నాథ ఆలయం రథయాత్రకు ప్రసిద్ధి. జగన్నాథ రథయాత్ర శ్రీకృష్ణుడు గోకులం నుంచి మధురకు చేసే యాత్రగా పరిగణించబడుతుంది. రథోత్సవం అంటే సాక్షాత్తు ఆ భగవంతుడు భక్తులను వె తుక్కుంటూ రావడం. కృష్ణుడు భక్తజన సమ్మోహనుడు. నరులతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండటం వలన నర నారాయణుడయ్యాడు. అందువలన జగన్నాథ రథోత్సవానికి భక్తులు పోటెత్తుతారు. ప్రపంచంలో అస ంఖ్యాక భక్త జనం పాల్గొనే ఉత్సవాలలో ఈ రథోత్సవానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆలయంలోకి అన్య మతస్థులకు ప్రవేశం నిషేధం. తన దగ్గరకు రాలేని వారి కోసం ఆ జగన్నాథుడు వీధులలో ఊరేగింపుగా వచ్చి అందరికి దర్శన భాగ్యం కలి గిస్తాడన్నది నమ్మకం. ఈ రథోత్సవాన్ని తిలకించి తరించడానికి కుల, మత, వర్గ విభేధాలను మరచి దేశవిదేశాల నుంచి అశేష జనవాహిని తరలి వస్తుంది. ఇసుక వేస్తే రాలనంత జనసంద్రంతో పూరీ నగరం కిటకిటలాడుతుంది.

పూరీలో రథయాత్ర సందర్భంగా అంగరంగ వై భవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. జ్యేష్ఠ పౌర్ణమినాడు జరిగే స్నాన పౌర్ణమి లేదా అభిషేకాల పౌర్ణమితో ఉత్సవాలు మొదలవుతాయి. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాడు నేత్రోత్సవం, విదియనాడు రథయాత్ర, ఏకాదశినాడు బహుదా రథయాత్ర లేదా మారు రథయాత్ర (అనగా రథాలు తిరిగి ఆలయానికి చేరుకోవడం) నిర్వహిస్తారు.

రథోత్సవం ప్రారంభానికి ముందు జ్యేష్ఠ పౌర్ణమి నాడు 108 బిందెల పుణ్యజలాలతో దేవతా మూర్తులకు అభిషేకం చేస్తారు. ఈ సుదీర్ఘ స్నానంతో వారు అనారోగ్యం బారిన పడి, తిరిగి కోలుకొనేవరకు రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకుంటారు. ఆ సమయంలో దర్శనాన్ని నిలిపివేస్తారు. 56 రకాల ప్రసాదాలు ఆరగించే స్వామికి, ఆ సమయంలో పథ్యంగా కందమూలాలు, పండ్లు మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు. తిరిగి ఆషాఢ శుద్ధ పాడ్యమి నాడు ఆలయ ప్రవేశంతో నేత్రోత్సవం జరిపి యథాప్రకారం నైవేద్యం సమర్పిస్తారు. స్నాన పౌర్ణమి, నేత్రోత్సవం వంటి ఉత్సవాలు ఇంట్లోని విగ్రహాలకు చేయడం ఒడిషావాసులకు ఆనవాయితీ. స్నాన పౌర్ణమినాడు వి గ్రహాలకు అభిషేకం చేసి, వాటికి కొత్తగా రంగులు వేసి అలంకరిస్తారు.

రథయాత్రకు ఉపయోగించే రథాలను ప్రతి సంవత్సరం కొత్తగా తయారుచేస్తారు. జగన్నాథుడు ఊరేగే రథాన్ని ‘నందిఘోష్‌’ లేదా ‘గరుడధ్వజ’ అంటారు. 45 అడుగుల ఎత్తుతో, 832 దుంగలతో చేయబడి, 16 చక్రాలు కలిగి ఉంటుంది. నందిఘోష్‌ చతుర్వేదాలకు ప్రతీకగా 4 గుర్రాలు పూన్చబడి ఉం టాయి. బలభద్రుని రథం ‘తాళధ్వజ్‌’ 44 అడుగుల ఎత్తుతో, 14 చక్రాలతో చతుర్యుగాలకు ప్రతీకగా నాలుగు గుర్రాలు లాగుతూ ఉంటాయి. సుభద్ర రథం ‘దర్పదళన్‌’ 43 అడుగుల ఎత్తుతో 12 చక్రాలతో ఉంటుంది. అక్షయ తృతీయ రోజున ర థాల తయారీ మొదలుపెడతారు. ఈ రథాలను ఆగమశాస్త్రం ప్రకారం నిర్మిస్తారు. 1072 కొయ్య దుంగలతో 120 మంది పనివారు రథాల తయారీలో పాలుపంచుకుం టారు.

ఆషాఢ శుద్ధ విదియనాడు ప్రారంభమయ్యే రథయాత్రలో జగన్నాథ, బలభద్ర, సుభద్రలు వేరు వేరు రథాలు అధిరోహిస్తారు. గర్భాలయంలో రత్న సిహాసనం పై కొలువై ఉన్న జగన్నాథుడిని , సోదరుడు బలభద్ర, సోదరి సుభద్ర దేవి దేవతామూర్తులను ఆలయ సిం హద్వారం గూండా తీసుకొచ్చి అందంగా అలంకరించినటువంటి రథాలలో ఉంచి ఊరేగిస్తారు. జగన్నాథుడు నల్లని ముఖారవిందం, పెద్ద పెద్ద కళ్ళతో, బలభద్రుని ముఖం తెల్లని వర్ణంతో, సుభద్ర ముఖం పసుపు వర్ణంతో భక్తులకు కనువిందు చేస్తాయి.

యాత్ర ప్రారంభానికి ముందు రథాన్ని, అక్కడి ప్రాంతాన్ని పూరీ రాజకుటుంబానికి చెందిన రాజు బంగారు చీపురుతో శుభ్రం చేస్తాడు. రాజైనా భగవంతుని ముందు సేవకుడే అని తెలిపేందుకు అనాదిగా ఈ ఆచారాన్ని పాటిస్తుండడం విశేషం. రుథయాత్ర సాగే వీథిని ‘బొడోదండో’ అని అంటారు. యాత్ర సుమారు 3 కి.మీ. మేర సాగుతుంది. ముందు బలభద్రుని రథం సాగుతుండగా, తరువాత సుభద్ర రథం దాన్ని అనుసరిస్తూ జగన్నాథ రథం సాగుతుంది. సోదరికి రక్షణగా ఆమె వెనుక జగన్నాథుడు పయనిస్తాడు. జగన్నాథ రథయాత్ర సాగుతుండగా ప్రత్యక్షంగా వీక్షించే లక్షలాది మంది భక్త జన తన్మయత్వం చెప్పనలవి కాదు. ‘రథస్తం జగన్నాథం దృష్ట్వా, పునర్జన్మ నభిద్యతే’ అంటే జగన్నాథ రథయాత్రను ప్రత్యక్షంగా వీక్షిస్తే పునర్జన్మ ఉండదని నమ్మకం. నేరుగా దర్శిచుకోలేనివారు ‘నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే | సుభద్రాప్రాణనాథాయ జగన్నాథాయ మంగళమ్‌||’ అనే శ్లోకాన్ని జపించవచ్చు. దేశవిదేశాల నుంచి కుల, మత, వర్గ విబేధాలు మరచి తరలి వచ్చే భక్తజనం జగన్నాథుని రథాన్ని లాగడానికి పోటీ పడతారు.

రథయాత్ర ‘గుండీచ’ మందిరం వరకు కొనసాగుతుంది. గుండీచ జగన్నాథుడి పెంపుడు తల్లి. గుండీచ మందిరంలో బసచేసి, తొమ్మిదవ నాడు అంటే ఏకాదశి రోజున ఆలయానికి తిరిగి ప్రయాణమవుతారు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు. ఈ తిరుగు రథయాత్రను ‘బహుడా’ రథయాత్ర అని అంటారు. విగ్రహాలు తిరిగి ఆలయంలో ప్రవేశించే సమయంలో, తనను నిర్లక్ష్యం చేసి యాత్రకు తీసుకు వెళ్ళనందున అలిగిన మహాలక్ష్మి జగన్నాథుడు మందిరంలోకి రాకుండా నిలువరిస్తుంది. స్వామి వారు కొన్ని మధుర ఫలాలతో ఆమెను ప్రసన్నం చేసుకొని మందింరంలోకి ప్రవేశిస్తాడని కథనం. ప్రస్తుతం జగన్నాథుడు ఆలయ ప్రవేశం చేసే సమయంలో జాతర రూపంలో మహాలక్ష్మిని శాంతపరుస్తారు. అంతట విగ్రహరూపంలో ద్వారం తలుపుల పై ఉన్న మహాలక్ష్మి జ గన్నాథ, బలభద్ర, సుభద్ర ఆలయ ప్రవేశానికి అనుమతిస్తూ ఆలయానికి చేరిన దేవతా మూర్తలకు వన మధుర పదార్థాలని నైవేద్యంగా సమర్పిస్తారు. అనతరం జగన్నాథస్వామి బంగారు జలతారు వస్త్రాలు ధరించి భక్తులకు పున:దర్శన ప్రాప్తం కల్పిస్తారు.

పూరీ ప్రసాదం కూడ అత్యంత విశిష్టమైనది. అద్భుత రుచి కలిగి ఉంటుంది. నూనె చుక్క వాడకుండా మట్టికుండలను ఒక దానిపై ఒకటి పెట్టి అన్నాన్ని, పప్పుని ఉడకబెట్టి ప్రసాదాన్ని తయారుచేస్తారు. ప్రసాదానికి ఇంతటి రుచిరావడానికి గల కారణం సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి పర్యవేక్షణలో తయారుకావడమేనని నమ్ముతారు.

నవకళేబరోత్సవం

జగన్నాథ విగ్రహాల తయారీకి, రథాల నిర్మాణానికి ఒక ప్రత్యేక విధానముంది. ప్రతి పన్నెండేళ్ళ నుంచి పందొమ్మిదేళ్ళ కొకసారి ఏ సంవత్సరంలో అయితే ఆషాఢ మాసం రెండు సార్లు వస్తుందో (అధిక ఆషాఢం), ఆ సంవత్సరం నవకళేబరోత్సవం పేరుతో విగ్రహాలు మారుస్తారు. ప్రత్యేక లక్షణాలు కలిగిన వేపమానును విగ్రహాల తయారీకి ఉపయోగిస్తారు. అటువంటి ప్రత్యే వేపమానును ”దారుబ్రహ్మ” అని పిలుస్తారు. అనాదిగా వస్తున్న నమ్మకం ప్రకారం ‘కాకత్‌పురా మంగళాదేవి’ జగన్నాథ ఆలయ పూజారులకు కలలో దర్శనమిచ్చి ”దారుబ్రహ్మ” అని లభించే స్థలాన్ని సూచిస్తుంది. ఆ సూచన ప్రకారం నాలుగు దారు బ్రహ్మలు గుర్తించి, వాటితో విగ్రహాల తయారీ చేపడతారు. ఆగమ జ్యోతిష్యగ్రహగతుల లెక్కల అనుసారం పాత మూర్తులను ఖననం చేసి వాటి స్థానే కొత్తవి చేర్చడం జరుగుతుంది. కాని జగన్నాథుని నాభి బ్రహ్మం మాత్రం పాత విగ్రహ ం నుంచి కొత్త విగ్రహానికి అమర్చబడుతుంది. విష్ణు పురాణానుసారం విష్ణువు నాభి నుంచి బ్రహ్మ పుడతాడు (ఆవిర్భవిస్తాడు). అందుకే విగ్రహాలు మార్చినా, జగన్నాథుని నాభి భాగాన్ని అలాగే ఉంచుతారు. ఆదివాసీ వంశస్థులైన ‘దైతపతులు’ ఆలయంలో జరిగే పూజలో పాల్గొంటారు. దైతపతులే కొత్త దేవతా మూర్తులకు ప్రాణ ప్రతిష్ఠ గావిస్తారు. ఇది జరిగిన మూడు రోజుల తరువాత ప్రపంచ ప్రఖ్యాత రథ యాత్రను నిర్వహిస్తారు.

నీలాచల నివాసాయ | నిత్యాయ పరమాత్మనే ||
సుభద్రాప్రాణనాథాయ | జగన్నాథాయ మంగళమ్‌||

Advertisement

తాజా వార్తలు

Advertisement