Friday, April 26, 2024

Hyd: కారులో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రమాదం

హైదరాబాద్‌ నగరంలోని మాదాపూర్‌లోని హైటెక్ సిటీ సమీపంలో ఉన్నట్టుండి ఓ కారులో మంటలు చెలరేగాయి. కారు నడుస్తుండగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉన్నవారు అప్రమత్తమవడంతో ప్రాణనష్టం తప్పింది. కారులో ఉన్నవారు వాటిని గుర్తించి వెంటనే దిగిపోయారు. మంటలకు కారు ధ్వసమయింది. ఈ నేపథ్యంలో హైటెక్ సిటీ దారిలో వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును రోడ్డుపైనుంచి తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement