Saturday, April 27, 2024

పర్వతాకారుడు వృత్రుడు

పార్వతీదేవి శాపం వలన చిత్రకేతుడు అనే గంధర్వరాజు వృత్రుడుగా జన్మించాడు. విధ్యాధరుల కు అధిపతి అయిన ‘చిత్రకేతుడు’ వృత్రాసురినిగా జన్మించాడు. ఇంద్రుడు ‘విశ్వరూపుని’ మూడుతలలు ఖం డించాడని తెలిసికొన్న ‘త్వష్ట’ కోపంతో చంపడానికై ఒక మారణ హోమం చేశాడు. హోమాగ్ని నుండి ‘వ ృ త్రుడు’ పుట్టాడు. వృత్రాసురుడు శరీరం నానాటికి పెరుగుతూ, కాలిన పర్వతంగా ఉన్న శరీర కాంతితో, జుట్టు కొనలు కలిగి, వజ్రాయుధంలా మెరిసే కోరలతో ప్రకాశించే ముఖంతో, నింగినీనేలను తాకే ఎత్తులోవుండి నోరు తెరిచి ఆకాశాన్ని చరుస్తున్నాడు. నాలుకతో గ్రహాలను, నక్షత్రాలను నాకుతున్నాడు. ఎవ్వరికీ లొంగకుండా విజృంభిస్తున్నాడు. అదిచూచి దేవతలు వృత్రాసురిని మీదకు అస్త్రాలను ప్రయోగించగా వాటినన్నింటినీ మ్రింగేవాడు. అదిచూచి దేవేంద్రుడు మొదలగువారు భయపడి ‘విష్ణు మూర్తి’ తో మొరపెట్టుకోవాలని అనేక విధాల ప్రార్థించగా, విష్ణువు ప్రత్యక్షమైనాడు. దేవతలందరూ నమస్కరించారు. అంత విష్ణువు దేవతలతో ‘దధీచి అనే పేరుగల ఒక ఋషి ఉన్నాడు. అతడు గొప్ప దానశీలి. అతని శరీరం నా శక్తితోకూడి మిక్కిలి ప్రభావంత మైనది. అతణ్ణి యాచించి ఆ శరీరాన్ని పొందండి. పూర్వం అతడు ‘అశ్వినీ దేవతలకు’ ‘అశ్వశిరోనామము’ అనే విద్యను ఉపదేశించగా వారు జీవన్ముక్తులయ్యారు. దేవశిల్పి కుమారుడైన విశ్వరూపునికి ‘నారాయణా త్మకమైన’ కవచాన్ని దధీచి మహర్షి ఇచ్చాడు. కాబట్టి అశ్వినీ దేవతలు ప్రార్థిస్తే తప్పకుండా అతడు తన శరీరాన్ని దానం చేస్తాడు. అతని శరీ రంలోని అస్తికలను తెచ్చి విశ్వకర్మ నూరు అంచులుగల ఆయుధాన్ని నిర్మించి ఇస్తాడు. అది నా శక్తితోకూడినదై, వృత్రాసురుని శిరస్సును ఖండించగలదు. ఆ పిదప మీరు పూర్వవైభవాన్ని పొందగలరు అని చెప్పి అదృశ్యుడయ్యాడు. అందరూ అశ్వినీ దేవతలను ముందుం చుకొని దధీచి వద్దకు వెళ్ళి ప్రార్థించారు. ఆయన యోగశక్తితో శరీరాన్ని వదిలివేశాడు. అప్పుడు విశ్వకర్మ దధీచి శరీరంలోని ఎముకలను తెచ్చి నూరంచులుగల వ్రజము అనే ఆయుధాన్ని నిర్మించి ఇంద్రునకు ఇచ్చాడు. వృత్రాసురుని మీదకు దండెత్తారు. వృత్రాసురుడు తన దైత్య సైన్యం తో ఇంద్రాది దేవతలను ఎదుర్కొన్నాడు. కృతయుగంలో ప్రారంభమైన దేవదానవుల పోరు త్రేతాయుగం వరకు సాగింది. వృత్రుడు ఇంద్రుడు పైకి దూకాడు. ఇంద్రుడు వజ్రాయుధంతో అతని రెండు చేతులు నరికేస్తాడు. కోపించిన వృత్రుడు దవడలను భూమ్యాకాశ పర్యంతం తెరచి, ఐరావతాన్ని ఆయుధం తో చుట్టేసి, ఇంద్రున్ని మ్రింగేసాడు. అప్పు డు ఇంద్రుడు వైష్ణవీ విద్యను మనసులో నిలిపి కదలకుండా ఉంటాడు. ఇంద్రుడు వృత్రుని పొట్టను చీల్చి ఐరావతంతో కూడా బయటపడతాడు. మరలా వ్రజాయుధాన్ని ప్రయోగిస్తాడు. అది వృత్రాసురుని చేరి తలను త్రుంచి నేల కూలుస్తుంది. వృతాసురుని శరీరం నుండి ఒక దివ్యకాంతి బయల్వడి విష్ణు
లోకానికి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement