Sunday, April 28, 2024

సంఖ్యా కాండ దర్శనం

సంఖ్యా కాండం, మోషే గ్రథితం అయిన గ్రంథ పంచకంలో నాల్గోది. ఐగుప్తు నుంచి విడుదల అయ్యాక, లేవీయులంతా సీనాయి పర్వతం చేరాక, ఇశ్రాయేలీయుల్లో 12 గోత్రాలకూ సంబంధించిన వారేగాక మిగిలినవారూ ఇక్కడ ఉన్నారు. ఆ అపత్కాలంలోనే గాక, శత నిర్మూల నార్థం వీరు ప్రత్యేకంగా సుశిక్షితులు కావలసిన అవసరం చాలా ఉంది. అయితే ఇక్కడ ఉన్న వీరందరిలోనూ వీరులెవ్వరో శూరులెవ్వరో తేల్చుకోడానికి ఒక లెక్క అవసరమైంది. అదే ఈ సంఖ్యాకాండం. ఇది ముప్పై ఆరు అధ్యాయాల గ్రంథం. సంఖ్యా కాండాన్నే మొషేయం అని కూ డా అనొచ్చు. ఎందుకంటే మోషే జీవితం ప్రజా నాయకత్వం దాదాపుగా నలభై యేళ్ళ పాటు ఇక్క డనే సాగింది. ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ఇంత సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడుదుడుకులు, సణుగుడులు, విసుగుదల వీటితో సాగింది. ఓ రకంగా ఈ సంఖ్యాకాండాన్నే ఎడారి ప్రయాణం అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఏ చెట్టూ పుట్టా లేకుండా ఎండనక వాననక ప్రజలంతా అష్టకష్టా లతో, ఏనాటికైనా శుభం జరక్కపోతుందా అని తమ జీవన ప్రయాణం సాగించారు. ఇశ్రాయే లీయుల అరణ్య సంచారం కనిపిస్తాది.
ఇక్కడనే ప్రజలకు దేవుడు కనిపించి, వారి విధి విధానాల్ని ఉద్దేశించి మొదటి ఆజ్ఞను ఇచ్చా డు. వారి జీవితాల్లోకి అవిశ్వాసం, అవిధేయతలు ఏవిధంగా ప్రవేశించాయో, ఏ విధంగా మళ్ళించ ప్రయత్నించబడ్డాయో, అద్భుత దేవుని మహిమలో విమోషే నాయకత్వంలో ఎలా శుభంకరంగా పరిణమించాయో ఈ సంఖ్యా కాండంలో వివరింప బడింది. దైవ మందిర నిర్మాణానికి ముందటి రూపం ప్రత్యక్ష గుడారమే! దీన్నే ఆంగ్లంలో ‘టబెర్నికల్‌’ అంటారు. దేవుడు ప్రజల మధ్య ఉండ టానికి, ప్రజలతో భాషించటానికి ఏర్పాటైన తాత్కాలిక మందిరం. ఇందులో బలిపీఠం కూడా ఉండటం అతిముఖ్యమైంది. ఇది లేవీయ కాండంలో ప్రత్యక్షమౌతుంది.
ఆ ఇగుప్తు బంధ విమోచకులైన ఇశ్రాయేలు జనాంగం, సీనాయి పర్వత నివాసం అయిం తరు వాత అరణ్య వాసం. ఇక దాదాపు ఈ అరణ్య వాసం ముగింపే మోయబు ప్రాంత సంచారం.. అక్క డికి చేరుకున్నారు ఇశ్రాయేలీయులు. ఇది కానాన్‌ ప్రాంతానికి చేరువ లోనే ఉంది. అయితే, కానాకు వెళ్ళటానికై ఇంకా కేవలం పదకొండు దినాల ప్రయాణం మాత్రమే సరిపోతుంది. ఇప్పుడు మోషేతో ఉన్నవారిలో తన తోబుట్టువులైన అన్న ఆరోను, అక్క మిరియాంలూ తప్ప మిగిలిన వారంతా చిన్నవారే. చెప్పాలంటే ఈశ్రాయేలీయుల్లో రెండో తరం వారే!
ఇందులో యుద్ధం కోసం నిలబడే బలాఢ్యులు ఎంతమంది ఉన్నారో అని లెక్కిస్తే, ఆరు లక్షల కు పైబడి ఉన్నట్టుగా తేలింది. చిట్ట చివరికి కానాను చేరుకునేటప్పటికి మరో ఆరు లక్షలమంది యుద్ధవీరులు తేలారు. ఇది తన బిడ్డల్ని రక్షించేందుకు దేవుడు నిర్ణయించిన సంఖ్య.
అవిశ్వాసం అనేది ఎన్ని వినాశకరమైన మార్పులైనా తెస్తుంది అనడానికి ఈ సంఖ్యాకాండలో ఇశ్రాయేలీయులు మోషేను, దేవుడ్ని నమ్మకపోవటమే. అనుమానించటమే. దానివల్ల చాలా కష్టాల్ని ఎదుర్కోవలసి వచ్చింది. చాలామంది ఆ అరణ్యంలోనే చనిపోయారు. కొందరు మోషేపై అసూయపడి, మోషే వివాహాన్ని కూడా విమర్శించిన తన తోబుట్టువులు ఆరోను, మిర్యాములిద్ద రూ గమ్యం చేరకుండనే చనిపోయారు. కానాను (వాగ్దాన భూమి) వారి కంట పడలేదు.
విశేషం ఏమంటే, దేవుడు చెప్పినట్టుగా కాకుండ, దేవుని పట్ల మోషే తన అహంకారాన్ని అవిధేయతనూ ప్రకటించాడు. దానికి తగ్గ శిక్షనే అనుభవించాడు. మోషే కూడా కానానులో కాలు పెట్టలేకపోయాడు. కొత్త నాయకత్వం అవసరమైంది. అది నెరవేర్చడానికి ప్రజలు, మోషే శిష్యుడైన జాషువాను ఎంపిక చేసుకున్నారు. అందుకు మోషే కూడా ప్రోత్స#హంచటం గొప్ప విశేషం. (308)

Advertisement

తాజా వార్తలు

Advertisement