Sunday, May 19, 2024

కృతజ్ఞత స్తుతి

మానవుడు ఎల్లవేళలా దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. ఈ సృష్టిలో ఏ జీవికీ లేని ఆధిక్య తను దేవుడు నరునికిచ్చాడు. తన రూపంలో తన పోలిక చొప్పున నరుని సృజించడమే కాకుండా గొప్ప ఆలోచనా శక్తిని, వివేచన, విజ్ఞానం మానవుని సొంతం చేసాడు. మనిషి శరీర నిర్మాణమే గమనిస్తే ఎంతో అద్భుతం. మెదడు యొక్క అమరిక అనిర్వచ నీయం. తన మేధస్సుతో సృష్టికి ప్రతి సృష్టి చేయాల న్న ఆలోచనకు మానవుడు చేరుకున్నాడు. భక్తుడైన దావీదు దేవుని గొప్పతనాన్ని వివరిస్తూ ”దేవా నీ కార్యములు ఎన్నోవిధములుగా నున్నవి. జ్ఞానము చేత నీవు వాటన్నిటిని నిర్మించితివి. నీవు కలుగజేసిన విధము చూడగా భయమును, ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తు తులు చెల్లించుచున్నాను” అంటాడు.
దేవుడు నరుని సృష్టించడానికి ప్రధాన కారణం మానవులపై ఆయనకున్న అపారమైన ప్రేమ. ఈ లోకాన్ని ఎంతో ప్రేమించిన దేవుడు నశించిపోతున్న మానవుల కోసం తన ప్రియ కుమారుడైన ఏసుక్రీస్తు ను ఈ లోకానికి పంపి శిలువ మరణము ద్వారా బలియాగం చేసి నిత్య జీవానికి వారసులుగా చేసాడు. ఈ నిరీక్షణ ద్వారా మరణము తర్వాత కూడా సదా జీవించే భాగ్యాన్ని దయ చేశాడు.
ఆది కాలములో భక్తులు దేవుని మహిమ పరచ డానికి పశువులను వధించి కృతజ్ఞత బలి అర్పణ చేసే వారు. ఆ తర్వాత భౌతిక కార్యంకంటే హృదయాన్నే దేవునికి సమర్పించడం ద్వారా ఆధ్యాత్మిక స్తుతి ప్రారంభమయింది. దావీదు మహారాజు ఈ మర్మాన్ని గ్రహించి దేవుని స్తుతించ డానికి ఆసాపు అనే కీర్తనకారుడు, గాయకుని ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక బృం దాన్ని ఏర్పాటు చేయడం విశేషం. సర్వ జనులూ దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతు లు చెల్లించాలని, ఆయన పరిశుద్ధ నామాన్ని కీర్తించా లని, ఆయన సన్నిధిని వెతకాలని దేవుని అభిలాష.
స్తుతుల ద్వారా ఇశ్రాయేలు ప్రజలు శత్రువులపై ఎన్నో యుద్దాలు గెలిచారు. స్తుతులపైన దేవుడు ఆశీ ను డవుతాడని కీర్తించారు. దేవుని స్తుతించడం ద్వారా భూమి, సూర్యచంద్రులూ స్థిరంగా వుంటా రని, సకా లంలో వర్షాలు కురిసి భూమి సస్య శ్యామ లం అవు తుంది. వీచే గాలిలో దేవుని స్తుతి మనం వినగలం.
వాస్తవానికి మనలో కృతజ్ఞత బుద్ధి పుట్టించువా డు దేవుడే. అందుకే కృతజ్ఞత స్తోత్రంలో మన హృద యం నిండిపోవాలి. కృతజ్ఞతారహితుల్లో సైతం దేవు డు సమాధానం కలుగజేసి తన ప్రేమను వెల్లడిస్తాడు. భూ నివాసుల జీవితం నీడలా అస్థిరమని గ్రహించి సమస్త

మానవ కోటికి ఆధార భూతుడని దేవుని మహి మను తెలుసుకోలేడు అందుకే బతికియున్న కాలము ననే ఆ దేవాది దేవునికి హృదయ పూర్వకం గా కృతజ్ఞ తా స్తుతులు చెల్లించాలి. అందరితో మాట్లాడేటప్పుడు కృతజ్ఞతావచనమే పలకాలి. చాలామంది పదిమంది లో ఉన్నప్పుడు కావాలని విస్తారంగా మాట్లాడతారు.
దేవునికి ప్రీతికరమైనది ఆయనకు లోబడి కృత జ్ఞత కలిగి జీవించడమే. ఏ విషయంలోనూ చింత పడాల్సిన అవసరం లేదుగాని ప్రతి విషయంలో ప్రార్థ న, విజ్ఞాపముల చేత కృతజ్ఞతా పూర్వకంగా మన విన్న పములు తెలియజేయాలి. కృతజ్ఞత విషయంలోనూ నిలకడ చూపించాలి.
దేవుడిచ్చిన జీవపు వాక్యాన్ని బట్టి కృతజ్ఞత స్తుతులు అర్పించాలి. వాక్యం దహించు అగ్నిలా హృదయంలోని మాలిన్యాన్ని తీసివేసి పరిశుద్ధతను చేకూరుస్తుంది. మనం నెమ్మదితో సౌఖ్యంగా బతకడా నికి మనుష్యులందరి కోసం, పాలకులు, అధికారుల కోసం ప్రార్థన చేస్తూ కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి.
కృతజ్ఞత లేనివారి యెడల, దుష్టుల యెడల దేవు డు ఉపకారియై ఉన్నాడు. అందుకే మనం కూడా శత్రు వులను ప్రేమించాలి. మేలు చేయాలి. కనికర సంపన్ను డైన దేవునివలె మనం కనికరం చూపాలి. కృతజ్ఞత చెల్లించడంలో క్రీస్తు మాదిరిగా ఉన్నాడు. తన పరి చర్యలో ప్రతీసారి తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాడు. ఒకసారి అరణ్య ప్రదేశంలో తన సందేశంవింటూ వుండిపోయిన వేలాది మందికి భోజ నం పెట్టాల్సి వచ్చింది. ఒక చిన్న వానివద్ద ఉన్న ఐదు యవల రొట్టెలు, రెండు చిన్న చాపలు పట్టుకుని కృత జ్ఞతాస్తుతులు చెల్లించి వేలాదిమంది ఆకలి తీర్చాడు.
ఏసు ప్రభువు ఒకసారి సమరియ, గలలియ ప్రాంతం మీదుగా యోరూ షలేము వెళ్లేట ప్పుడు దారిలో పదిమంది కుష్టురోగులు తారసప డ్డారు. వారు దూరం నుంచే ప్రభువా మమ్మును కరుణించుము అని కేకలు వేస్తా రు. ఆ రోజుల్లో కుష్టువ్యాధిగలవారిని ఊరి లోనికి రానిచ్చే వారు కాదు. పొర పాటున వస్తే రాళ్లతో కొట్టి చంపే వారు. అయితే ప్రభువు వారిని చూసి కనికరపడి మీరు వెళ్లి యజకులకు కనపరచుకోమని చెప్పాడు.
వారు మార్గం మధ్యలోనే స్వస్థత పొందడం జరి గింది. అందులో 9 మంది కుష్టు రోగులు తమకు స్వస్థ త కలిగిన ఆనందంలో వెళ్లిపోతారు. అయితే అందు లో దేవుడు తెలియని సమరియ్యుడు మరల ప్రభు దగ్గరికి తిరిగివచ్చి దేవుని మహిమపరిచి ఏసుక్రీస్తు పాదాల మీదపడి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాడు. దేవుని ఎరుగని ఈ సమరీయుడు స్వస్థత పొందిన ఆ 9 మందికంటే ఎంతో శ్రేష్టుడుగా ఏసుప్రభు చెపుతాడు. కృతజ్ఞత కలిగి ఆ దేవుని సార్వభౌమాధికారానికి లోబడి జీవించ డం మానవు లకు ఎంతో శ్రేయస్కరం.

Advertisement

తాజా వార్తలు

Advertisement