Monday, May 20, 2024

రోటరీ క్లబ్ అధికారులకు ఒకరోజు శిక్షణ.. క్ల‌బ్ నిర్వ‌హ‌ణ‌పై అవ‌గాహ‌ణ‌..

తెనాలి, (ప్రభ న్యూస్): తెనాలి, మంగళగిరి , తాడేపల్లి , పొన్నూరు , బాపట్ల, రేపల్లె పట్టణాల్లోని రోటరీ క్లబ్స్ అధికారుల ఒకరోజు శిక్షణ కార్యక్రమం తెనాలి గుంటూరు ప్రధాన రహదారి మార్గంలోని ఓ హోటల్లో ఆదివారం నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షుడు ఈదర వెంకట పూర్ణచంద్ పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది.

క్లబ్ రీజనల్ ట్రైనర్ పి వి సత్యనారాయణ, గుంటూరు జిల్లా ట్రైనర్ అన్నే రత్న ప్రభాకర్, ట్రైనర్ అనిల్ చక్రవర్తి పాల్గొని 6 పట్టణాలకు చెందిన రోటరీ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారిలకు శిక్షణ, సెమినార్, సెమినార్లో ట్రైనర్లు, రోటరీ క్లబ్ ఏర్పాటు, ఆవశ్యకత, ఎన్నికల విధానం, క్లబ్ సేవలు, క్లబ్ లో పదవులు పొందిన వారు నిర్వహించాల్సిన విధులు, బాధ్యతలు, సభ్యత్వాల నమోదు, క్లబ్ సభ్యత్వాల నిధులు చెల్లింపులు, స్థానికంగా ఫండ్స్ సమీకరణ, ఇంటర్నెట్ , యాప్ ల ద్వారా క్లబ్ అందించే సందేశాలు సభ్యులకు ఉపయోగపడే తీరును తెలియజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement