Sunday, June 23, 2024

TS | చిరుత చర్మం పట్టివేత..

చెన్నూర్, (ప్రభ న్యూస్) : మంచిర్యాల జిల్లా కోటపెల్లె మండలం రాపనపెల్లి అంతరాష్ట్ర వంతెన చెక్ పోస్ట్ వద్ద చిరుత పులి చర్మం అమ్మకానికి తీసుకు వెళుతుండగా తమ సిబ్బంది తనిఖీచేసి పట్టుకున్నట్లు జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక అటవీశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఏసిపి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం చిరతపులి చర్మం విక్రయానికి ఇరువురు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని ముందస్తు సమాచారం మేరకు కోటపెల్లీ ఎస్ఐ రాజేందర్ సిబ్బందితో కలిసి రపనపెల్లి చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేయగా ఛత్తీస్గఢ్ కుచెందిన ఇరువురు మోటారు సైకిల్ పై అమ్మకానికి తీసుకువెళ్తు పట్టుకోవడం జరిగిందన్నారు.

నిందితులను విచారించగా గత రెండు సంవత్సరాల క్రితం చెత్తిష్ ఘాడ్ రాష్ట్రంలోని భూపాల పట్నం అటవీ ప్రాంతంలో చిరుతను హతమర్చారని చర్మం అమ్మకానికి అవకాశం కొరకు ఇంతకాలం ఎదురుచూస్తూ సోమవారం అమ్మకానికి బయలుదేరినట్లు నిదితులు దుర్గం పవన్ పోలీసుల విచారణ లో తేలినట్లు ఏసిపి తెలిపారు. నిదితుడు పవన్ తో పాటు కొనుగోలుకు సిద్ధం గా ఉన్నా బాబర్ ఖాన్ ను అరెస్టు చేసినట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న చిరుత చర్మాన్ని అటవీశాఖ కు అప్పగించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పోలీస్ సిఐలు ఎస్సైలు అటవీశాఖ అధికారులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement