Sunday, May 19, 2024

కాల పురుషులు!

కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. ధర్మరాజు పట్టాభిషిక్తుడయ్యాడు ఒకరోజు భీముడు రాజ సింహద్వారం వద్ద ఉండగా, నలుగురు యువకులు బ్రాహ్మణ రూప ధారులై వచ్చి నమస్కరించి, మేము నలుగురం ప్రక్క గ్రామం నుండి వస్తున్నాము. దారిలో కొన్ని సంఘ టనలు చూస్తే మాకే ఆశ్చర్యం కలిగింది. దాంతో సందేహ నివృత్తికై తమ వద్దకు వచ్చామని తెలపగా, భీముడు ”ఆ సందేహం ఏమిటి?” అని అడిగాడు. వచ్చిన వారిలో మొదటి వ్యక్తి ప్రశ్న వేయగా, దీనికి మా అన్నగారు ధర్మరాజుగారే సమాధానం ఇస్తారని లోపలికి పంపాడు. తదుపరి రెండవ బ్రాహ్మణుడుని అడిగితే తన ప్రశ్న చెప్పగా, అతనిని ధర్మరాజు వద్దకు పంపాడు. ఇలాగే మూడు, నాలుగో బ్రాహ్మణులు తమ ప్రశ్నలు చెపితే వారిని లోపలికి పంపాడు. లోపలికి వెళ్ళిన బ్రాహ్మణులు ఎంత సేపటి కి, బయటకు రాకపోతే భీముడు లోపలికి వెళ్ళి., వాళ్ళ విషయం అడిగాడు. అప్పుడు ధర్మరాజు తిరిగి భీముడునే ‘వాళ్ళు ఏరి?’ అని తిరిగి ప్రశ్నించాడు. భీముడు నాకు తెలియదు వాళ్ళు బయటకు రాలేదు అన్నాడు. అప్పుడు ధర్మరాజు ”వాళ్ళు కాలపురుషులు” అని చెప్పాడు. ”మరి వారికి ఏంసమాధానం చెప్పావు.” అని అడిగాడు భీముడు. ధర్మరాజు ”మొదటివాడు అడిగిన ప్రశ్న. వాళ్ళు దారిలో, పొలం చుట్టూ ఉన్న కంచే పంటను తినేస్తోంది? ఇదేమి చోద్యం” అని అడిగాడు దానికి జవాబుగా ”రాబోయే కాలంలో ప్రజలను పరిపాలించవలసిన రాజులే ప్రజల ను అధోగతిపాలు చేస్తారని, అలాగే జీవితాంతం రక్షణగా ఉంటానని, అగ్నిసాక్షిగా పెళ్ళాడి న భార్యను బిడ్డలను పట్టించుకోరని దానర్థం అదేన”ని చెప్పాను అన్నాడు ధర్మరాజు. ఇక రెండవ ప్రశ్న: ”వచ్చే దారిలో ఒక చిన్న రంధ్రంలో నుండి పెద్ద ఏనుగు సులభంగా వచ్చేస్తోంది. కాని దాని తోక మాత్రం రావటంలేదు. ఏమిటి ఈ వింత?” అని అడిగాడు. దానికి ధర్మరాజు ”కలియుగంలో పెద్దపెద్ద స్కాంలు, దోపిడీలు చేసినవారు సునాయా సంగా బయటపడతారు. కాని చిన్నచిన్న స్కాంలు, తప్పులు చేసిన వాళ్ళు మాత్రం బయట పడలేరు.” అని సమాధానమిచ్చాడు.

ఇక మూడవ ప్రశ్న : ”వాళ్ళు వచ్చేదారిలో ఒక రైతు పెద్ద బస్తాను ధాన్యంతో నింపి, మళ్ళీ ఆ ధాన్యాన్ని చిన్నవాటిలో పోసి, మళ్ళీ పెద్ద బస్తాలోకి పోస్తే, ఇందాక నిండిన బస్తా ఇప్పుడు సగమే నిండింది. కారణం?” అంటే వృద్ధులైన తల్లిదండ్రులు తమ బిడ్డల క్షేమం గురించి పట్టించుకొంటే, ఆ బిడ్డలే వృద్ధులైన వారిని అర్థాకలితో ఉంచుతూ, పట్టించుకోరని.
ఇక నాల్గవ ప్రశ్న: ”దారిలో ఒక పెద్ద దేముడు రథాన్ని చిన్న దారంతో లాగుతున్నారు. అది ఎలా సాధ్యం? దానికి సమాధానంగా ”కలియుగంలో రక్షించేవాడు పరమాత్మ మాత్ర మే. కావున ఆయన మనకు ఏమి ఇచ్చాడు అనేదానికంటే, భక్తి అనే దారం కట్టినా నీకు దగ్గర అవుతానని దానర్థం.” అని చెప్పగానే వారు వెళ్లిపోయారు. చూడు భీమసేనా! వాళ్ళు ఎక్క డున్నా వెతికి తీసుకురా!” అని భీముడును పంపాడు ధర్మరాజు. భీముడు ఎంత గాలించినా వారి జాడ తెలియలేదు. చూసారా! ప్రస్తుతం సమాజం ఇలాగే ఉంది కదా. అందుకే మనం భక్తి మార్గంలోకి వెళ్ళి పరమాత్మ సేవ చేయడమే ఉత్తమ మార్గం.

  • అనంతాత్మకుల రంగారావు, 7989462679
Advertisement

తాజా వార్తలు

Advertisement