Wednesday, May 22, 2024

జ్ఞానయోగిని… స్వయంప్రకాశిని స్వయంప్రభ

రామాయణంలో వున్న పాత్రలలో చాలా ముఖ్యమైన పాత్ర చాలా తక్కువ మందికి తెలిసిన స్త్రీ పాత్ర స్వయంప్రభ. అన్ని రామాయణాలలో కిష్కింధ కాండలో ఈ పాత్ర మనకు కనిపిస్తుంది. ఎంతో పేరెన్నికగన్న పాత్ర. రామకథా గమ నానికి అవసరమైన విశిష్ట పాత్రల్లో స్వయంప్రభ కూడ ఒకటి. స్వయంప్రభ రామ కథతో పరోక్ష సంబంధం గల పాత్ర. శ్రీరామచంద్రుని సేవలో జీవితాన్ని పండిం చుకొన్న యోగిని స్వయంప్రభ. సీతాన్వేషణలో రాత్రింబగళ్ళు శ్రమించి అలసిపో యి ఆకలిదప్పులతో పీడించబడుతూ ఆశ్రయం కోరిన వానరసేనను, ఆదుకొని వారికి అతిథి సత్కారాలందించి, తిరిగి రామకార్య సాధనకు వలసిన జవసత్త్వాల ను వారికందించి రామసేవకులకు సేవచేసి, పరోక్షంగా రామసేవను చేసుకొని తరించిన దివ్యప్రభ ఈ స్వయంప్రభ.
సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం 4 దిక్కులకి వెళ్ళిన వానరములలో 3 దిక్కులకి వెళ్ళిన వానరములు నెలరోజుల తరువాత వెనక్కి తిరిగి వచ్చేశాయి. వాళ్ళు అన్ని ప్రాంతా లని వెతికినా సీతమ్మ జాడ ఎక్కడా కనపడలేదు.
దక్షిణ దిక్కుకి వెళ్ళిన వానరములు వింధ్యపర్వతం దగ్గరికి వెళ్ళి, ఆ పర్వతం లో ఉన్న చెట్లని, గుహలని, సరస్సులని, మార్గమధ్యంలో ఉన్న నదులని, పట్టణా లని, గ్రామాలని అన్వేషిస్తూ వెళుతున్నారు. అలా కొంత దూరం వెళ్ళాక నిర్జనమైన అర ణ్యానికి చేరుకున్నారు. వాళ్ళు ఆ అరణ్యాన్ని దాటి ముందుకి వెళ్ళగా, ఒక గుహ నుం డి బయటకి వచ్చిన భయంకరమైన రాక్షసుడు, అంగదుడు రావణుడే అనుకొని, తన అరిచేతితో ఒక దెబ్బకొట్టాడు. ఆ దెబ్బకి రాక్షసుడు కిందపడిపోయి మరణిం చాడు. అప్పుడు వారు ఆ రాక్షసుడు ఉన్నటువంటి గుహని వెతికారు, కాని ఎక్కడా సీత మ్మ జాడ కనపడలేదు.
అలా వారు ఎన్ని ప్రాంతాలని వెతికినా ఏమి ప్రయోజనం లేకపోయింది. వాళ్ళకి ఎక్కడా నీరు, ఆహారము దొరకలేదు, దాంతో వాళ్ళకి విపరీతంగా ఆకలి వేసింది. అప్పుడు వాళ్ళకి ఒక బిలం నుండి తడి రెక్కలతో పక్షులు రావడం కనపడింది, వాటి వెనకాల కొన్ని జంతువులు తడి శరీరాలతో బయటకి వస్తున్నాయి. అప్పుడా వానరాలు గడ్డితో, లతలతో కప్పబడి ఉన్న ఆ బిలంలోకి ప్రవేశించారు. అది ఋక్షబిలం. లోపలికి వెళితే అంతా చీకటిగా ఉంది, అందుకని ఆ వానరాలు ఒకరి చేతులని ఒకరు పట్టుకొని మెల్లగా లోపలికి వెళ్ళారు. చీకటి ప్రదేశంలో ఒకర్ని మరొకరు పట్టుకుని నడిచారు. ఆధ్యాత్మిక మార్గంలో చరించే వారంతా ఒకరికొకరు చేదోడుగా ఉండాలి. అదే సత్సంగం. సత్పురుష సాంగత్యం. చీకటిని దాటి వెలుగును దర్శించుటకు ఉపకరించేదే సత్సంగం.
తీరా లోపలికి వెళ్ళి చూస్తే, అక్కడ చెట్లన్నీ పండ్లతో, పుష్పాలతో, తేనెపట్లుతో పరమశోభి తంగా ఉన్నాయి. అక్కడున్న సరస్సులలోని నీరు చాలా తీయగా ఉంది. ఆ వానరాలు అక్కడ సరోవరాలలో ఉన్న నీటిని తాగి దాహం తీర్చుకున్నారు.
అప్పుడు వాళ్ళకి కొద్ది దూరంలోనే ఒక స్త్రీ కనబడింది. అక్కడ అగ్నిలా ప్రకాశిస్తున్న ఒ క తపస్విని ఉన్నది. ఆ స్త్రీ కృష్ణాజినం కట్టుకొని, నారచీర కట్టుకొని, తేజస్సుతో, తపో శక్తితో మెరిసిపోతూ ఉంది. ఆమే స్వయంప్రభ. అంటే స్వీయకాంతి. మరొకదానిపై ఆధా రపడని ప్రకాశం. అదే ఆత్మప్రకాశం. అదే స్వయంప్రభ. ఆ తల్లి దగ్గరికి ఈ వానరాలు వెళ్ళి నమస్కరించి ”బయ ట నుంచి చూస్తే చిన్నబిలంలా ఉంది, లోప లికి వస్తే ఇంత అద్భుతంగా ఉంది. ఈ గుహ ఎవరిది?”
అప్పుడా స్రీ ్త”పూర్వం దానవరాజు దగ్గర మయుడ నే శిల్పి ఉండేవాడు. ఆ మయుడికి అనేక మాయా శక్తులు ఉన్నాయి. ఆయన బంగారంతో ఈ ప్రాం తాన్ని నిర్మించాడు. ఆ మయుడు బ్రహ్మని గూర్చి 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. మయుడి తపస్సుకి ప్రీతి చెందిన బ్రహ్మదేవుడు ఆయనకి విశేషమైన వరాలని ఇచ్చాడు. తదనం తరం శుక్రాచార్యుల యొక్క ధనమంతా తీసు కొచ్చి మయుడికి ఇచ్చారు. కాని ఆ మయుడు హమ అనే అప్సరస స్త్రీ యందు మనస్సు పెట్టుకున్నాడని తెలిసి, ఇం ద్రుడు ఆయనని తన వజ్రాయుధంతో సంహరిం చాడు. మయుడు, హమ అనే అప్సరస స్త్రీ యందు మనస్సు పెట్టుకున్నాడు కనుక, ఈ గుహలో ఉన్న సమస ్త ఐశ్వర్యము కూడా హమకే చెందుతుందని తీర్పు ఇచ్చారు. అప్పుడా హమ ఈ ఐశ్వర్యానికి కాపలాగ ఉండడానికి నన్ను నియమించింది. నేను మేరుసావర్ణి కుమార్తెని, నాపేరు స్వయంప్రభ. నాకు స్నేహతురాలైన హమ నన్ను పిలిచి ఈ ఐశ్వర్యాన్ని, గుహని కాపాడమని అడిగింది. స్నేహము మీద ఉన్న అనురక్తి చేత నేను ఈ గుహని కాపాడుతూ ఉంటాను. మిమ్మల్ని చూస్తుంటే బాగా అలసి పోయినట్టున్నారు కనుక మీకు కావలసిన
కందమూలాలని, ఫలాలని ఆరగించండి. నీళ్ళు, తేనె కావలసినంత తాగి విశ్రాంతి తీసుకోండి. విశ్రమించిన తరువాత మీరు ఎవరో, ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు చెప్పండి” అంది. అప్పుడా వానరాలు కడుపు నిండా కావలసిన పదార్ధాలని తిని విశ్రమించారు. అప్పుడు హనుమంతుడు స్వయంప్రభతో ”దశరథ మహారాజు కుమారుడైన రాముడు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం తన భార్య అయిన సీతమ్మతో, తమ్ముడైన లక్ష్మణుడితో కలిసి అరణ్యవాసానికి వచ్చాడు. కాని సీతమ్మని రావణాసురు డనే రాక్షసుడు అపహరించాడు. అపహరింపబడ్డ సీతమ్మని వెతుకుతూ వాళ్ళు కిష్కిందకి చేరుకున్నారు. అక్కడ వారు సుగ్రీవుడితో మైత్రి కుదుర్చుకున్నారు. సుగ్రీ వుడు నాలుగు దిక్కులకి వానరాలని పంపించాడు, సీతమ్మని వెతకడం కోసం. యువ రాజైన అంగదుడి నాయకత్వంలో వచ్చిన వానర సమూహములో నేను ఒకడిని, నన్ను హనుమ అంటారు. సీతమ్మ జాడ కనిపెట్టడం కోసం వెతుకుతున్న మాకు ఎక్కడా ఆహా రం, నీరు దొరకలేదు. అటువంటి సమయంలో తడిరెక్కలతో పక్షులు ఈ గు#హ నుండి బయటకి రావడం చూశాము. ఇక్కడ నీళ్ళు దొరుకుతాయనే ఆశతో మేము ఈ గుహ ోకి ప్రవేశించాము. సీతమ్మ జాడ మాకు చెప్పగలవా” అని అడిగాడు.
అప్పుడా స్వయంప్రభ ”ఈ గుహలోకి మృగములు తప్ప మిగిలినవి ఏవన్నా ప్రవేశిస్తే, ప్రాణాలతో బయటకి వెళ్ళడం కుదరదు. కాని మీ అందరినీ నాతప:శకి ్త చేత బయటకి పంపిస్తాను. మీరు కళ్ళు మూసుకొని, కళ్ళ మీద చేతులు పెట్టుకోండి” అంది. అప్పుడా వానరాలు మృదువైన కనురెప్పల్ని మూసి, తమ మృదువైన చేతులతో ఆ కన్నులని మూసుకున్నారు. మళ్ళీ ఉత్తర క్షణంలో కనులు తెరిచేసరికి వాళ్ళందరూ వింధ్యపర్వతం మీద ఉన్నారు. అప్పుడా స్వయంప్రభ ”మీరు ఈ గుహలో 4 నెలల పాటు ఉండిపోయారు.” అని చెప్పి గుహలోకి వెళ్ళిపోయింది.
ఈవిధంగా నిస్వార్ధ తపస్విని అయిన స్వయంప్రభ వానరుల సీతాన్వేషణకు సహకరించి, కథను మలుపు తిప్పింది. సార్ధక నామధేయురాలు స్వయంప్రభ. తనకు తానుగా స్వయంప్రకాశమాన యైన జ్ఞానయోగిని ఆమె.

Advertisement

తాజా వార్తలు

Advertisement