Tuesday, April 30, 2024

కొలువు తీరిన కొత్త కలెక్టర్ షన్మోహన్

చిత్తూరు (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్ గా సగిలి షన్మోహన్ సోమవారం పదవీ బాధ్య‌తలు స్వీకరించారు. రెండేళ్లుగా చిత్తూరు జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్న హరినారాయణన్ నెల్లూరు జిల్లా కలెక్టర్ గా బదిలీ కావడంతో ఆ స్థానంలో షన్మోహన్ నియమితులైన విషయం విదితమే. కాగానే ఉదయం షన్మోహన్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు స్వీకరించారు. అనంతరం చిత్తూరు జిల్లా సచివాలయానికి చేరుకున్న షన్మోహన్ కు జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్ స్వాగతం పలుకగా వేద పండితులు ఆశీర్వదించారు. కొత్త కలెక్టర్ ను ఇతర జిల్లా స్థాయి అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement