Saturday, April 27, 2024

దైవానికి ఇష్టమైన ప్రసాదాలు

ప్రపంచం అంతటా నిండి ఉన్న దైవానికి పూజ చెయ్య డం, ప్రసాదాన్ని సమర్పించడం మానసిక సంతృప్తి ఇవ్వడమే కాక అనేక కోరికలను కూడా తీర్చుతుంది. అలా దైవానికి ప్రసా దంగా సమర్పిం చేవి ఆహార పదార్థాలు, పండ్లు మాత్రమే కాదు… ఇంకా అనే రకాల ప్రసాదాలను భక్తితో సమర్పించి, వాటిని ప్రసాదంగా స్వీకరించి దేవుని అనుగ్రహాన్ని పొందవ చ్చని మన ఇతిహాసాలు పేర్కొన్నాయి.
తీర్థ ప్రసాదం- పంచామృత అభిషేక తీర్ధం, పానకం, జల తీర్ధం, కషాయ తీర్ధం.
పత్ర ప్రసాదం- తులసి, మరువం, దవనం, బిల్వ పత్రం, శమీ, గరిక, కుశ, పాటలీ, సింధువార పత్రం.
భక్ష్య ప్రసాదం- వడలు, దోశెలు, లడ్డూలు, బొబ్బట్లు, అరిసెలు, కేసరి, పాలకోవా, చెగోడీలు మొదలయినవి.
కుంకుమ ప్రసాదం- కుంకుమ, పసుపు, సింధూరం, గోపీ చందనం, రక్త చందనం, అంగార, అష్ట గంధం, చాదు, తిరు మణం, శివ గంధం మొదలయినవి.
పుష్ప ప్రసాదం- సువాసనా భరితం, పూర్తిగా వికసించిన పువ్వులు. కమలం, మొగలి, సంపెంగ, మల్లి, జాజి, కలువ, తులసి, విప్ప మొదలయిన పుష్పాలు.
అన్న ప్రసాదం- నేతి అన్నం, చిత్రాన్నం, పులిహూర, దద్దోజనం, పెరుగన్నం, కారపు అన్నం, పాయసాన్నం, పుల గం మొదలయినవి.
ఫల ప్రసాదం- అరటి పండు, మామిడి, దానిమ్మ, సపోటా, నేరేడు, కమలాఫలం ఆపిల్‌, ద్రాక్ష, జామ, అంజీర మొదల యినవి.
వస్త్ర ప్రసాదం- అమ్మవారికి చీర, స్వామికి పంచె, శాలువా సమర్పించాలి.
రక్షా ప్రసాదం- నవగ్రహ పీడకు రక్ష, హూమ రక్ష, దీప రక్ష.
గంధ ప్రసాదం- శ్రీ గంధపు చెక్క, శ్రీ గంధ తిలకం.

  • ఆభరణ ప్రసాదం- కొత్త బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు మొదట దేవుడికి సమర్పించి ధరించాలి.
    అక్షతా ప్రసాదం- పసుపు అక్షతలు, సువర్ణ మంత్రాక్ష తలు, మంత్రాక్షతలు.
    లేపన ప్రసాదం- తైలలేపనం, నవనీత లేపనం, అన్న లేపనం, మృత్తికా లేపనం.
    మృెత్తికా ప్రసాదం- పుట్ట మన్ను, మట్టి ఉండ.
    నేత్ర ప్రసాదం- అంటె కన్నుల ప్రసాదం. పరమేశ్వరుని భార్య అయిన ద్రాక్షాయణి తన తండ్రి చేసిన యాగంలో తనకు తన భర్తకు అయిన అవమానాన్ని తాళలేక యాగం చేస్తున్న యజ్ఞకుండలో దూకి ఆత్మహత్య చేసుకొంటుంది. ఈ స్థలాన్ని మనం హరిద్వారలోని సతీకుండం దగ్గర చూడవచ్చు. ఈ విషయాన్ని విని పరమేశ్వరుడు తన భార్య ద్రాక్షాయణి దేవి నిర్జీవ శరీరాన్ని భుజానికి ఎత్తుకొని భూప్ర దక్షణ చేస్తున్న సమయంలో విష్ణువు చూసి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని తన యోగ మాయచే 64 భాగా లుగా చేస్తాడు. కొందరు 108 అని అంటారు. దేవి ఒక్కోభాగం ఒక్కో ప్రదేశంలో పడతాయి. వాటికి శక్తిపీఠాలని ప్రతీతి. సతీదే వి నయనాలు అంటే కళ్ళు పడిన ప్రదేశమే హమాచల ప్రదేశం లోని నయనదేవి మందిరం.
    ఈ నయనదేవికి పండ్లు, పూలతో పాటు కన్నులను తీసుకుని వెళ్ళితే వాటిని దేవికి తాకించి, భక్తు లకు కన్నులను ప్రసాదంగా ఇస్తారు. ఈ క్షేత్రంలోని దుకాణాల లో ఇత్తడి, వెండి, బంగారు కన్నులను విక్రయిస్తారు.
    మాంస ప్రసాదం- సాత్విక, రాజస, తామస దేవతల్లో విభా గాన్ని బట్టి మూడు రకాలుగా నైవేద్యాలు ఉంటాయి. క్రూర, రౌద్ర, క్షుద్ర దేవతలకు రాజస తామసమైన ఆహారాన్ని నైవే ద్యంగా ఉంచుతారు. సాత్విక దేవతల ఆహారానికి నైవేద్యం అని పేరు. రాజసచ తామస దేవతల ఆహారానికి బలి అని పేరు.
Advertisement

తాజా వార్తలు

Advertisement