Sunday, May 19, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 16, శ్లోకం 21
21.
త్రివిధం నరకస్యేదం
ద్వారం నాశనమాత్మన: |
కామ: క్రోధస్తథా లోభ:
తస్మాదేతత్త్రయం త్యజేత్‌ ||

తాత్పర్యము : కామము, క్రోధము, లోభము అనునవి మూడు నరకద్వారములై యున్నవి. అవి ఆత్మనాశకరములు కావున బుద్ధిమంతుడైన ప్రతి మనుజుడు వాటిని త్యజించివేయవలయును.

భాష్యము : ఈ శ్లోకము నందు అసుర లక్షణాలు ఎలా మొదలవుతాయో తెలియజేయటమైనది. ఎప్పుడైతే జీవి తన కామమును తీర్చుకొన ప్రయత్నించునో, అది విఫలమై కోపము చివరకు లోభము లేదా దురాశగా మారుతుంది. కాబట్టి బుద్ధిమంతుడు ఈ మూడు నరక ద్వారములకు దూరముగా ఉండవలెను. లేనట్లయితే అసుర జన్మలకు దిగజారి ముక్తిని పొందే అవకాశాన్ని కోల్పోతాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement