Saturday, April 27, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 13, శ్లోకం 30
30
ప్రకృత్యైవ చ కర్మాణి
క్రియమాణాని సర్వశ: |
య: పశ్యతి తథాత్మానమ్‌
అకర్తారం స పశ్యతి ||

తాత్పర్యము : భౌతిక ప్రకృతిచే సృష్టింపబడిన దేహము చేతనే సర్వకార్యములు ఒనరింపబడుచున్నవనియు మరియు తాను అకర్తననియు గాంచగలిగిననాడు యదార్థదృష్టిని కలిగినట్టివాడు.

భాష్యము : పరమాత్మ పర్యవేక్షణలో భౌతిక ప్రకృతి ప్రతి జీవికి తగిన శరీరమును ఇస్తుంది. కాబట్టి ఆ శరీరమునకు తగ్గట్టు ఏదైతే ఆనందాన్ని ఇస్తుందో, దు:ఖాన్ని దూరంల చేస్తుందో దానిని జీవుడు చేయవలసి వస్తుంది. అంతేగాని జీవుడు స్వతహాగా ఏమీ చేయడు. నిజానికి ఈ శరీరము మన కోరికలను తీర్చుటకు భగవంతునిచే నిర్మించబడిన ఒక యంత్రము వంటిది. జీవుని భౌతిక కోరికల వలన అతడు సుఖదు:ఖాల కోసము అనేక క్లి ష్ట పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తుంది. ఎవరైతే జీవుడు శరీర కార్యాలకు అతీతుడని, అతని దివ్యస్థితిని గాంచగులుగుతారో వారే నిజమైన తత్త్వ దర్శులు అనబడతారు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement