Thursday, May 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 11, శ్లోకం 50
50.
సంజయ ఉవాచ
ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా
స్వకం రూపం దర్శయామాస భూయ: |
ఆశ్వాసయామాస చ భీతమేనం
భూత్వా పున: సౌమ్యవపుర్మహాత్మా ||

తాత్పర్యము : ధృతరాష్ట్రునితో సంజయుడు పలికెను : దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఆ విధముగా అర్జునునితో పలికి తన చతుర్భుజ రూపమును ప్రదర్శించెను. భీతుడైన అర్జునునకు ఆ విధముగా అశ్వాసమును గూర్చుచూ అంత్యమున తన ద్విభుజ రూపమును చూపెను.

భాష్యము : కృష్ణుడు దేవకీ వసదేవులకు పుత్రుడుగా అవతరించినప్పుడు మొదట చతుర్భుజ రూపమున నారాయణుడిగా అవతరించగా, తల్లిదండ్రుల అభ్యర్ధన మేరకు సాధారణ బాలుడిగా మారెను. అలాగే అర్జునుని కోరిక మేరకు చతుర్భుజ రూపమును దాల్చినా, చివరకు అర్జునునికి ఇష్టమైన ద్విభుజరూపమును తిరిగి ప్రదర్శించెను. ఆ విధముగా అందరినీ శాశించే కృష్ణుడు అర్జునుని భయాన్ని కూడా దూరము చేసెను. ఇక్కడ ”సౌమ్యవపు:” అను పదము చాలా ముఖ్యమైనది. కృష్ణుని రూపము ఎంతో ఆకర్షణీయమైనది. కృష్ణుడు అవతరించినప్పుడు అందరూ ఆయన సౌందర్యానికి ఆకర్షితులయ్యారు. అయితే కేవలము ప్రేమైక హృదయము ఉన్నప్పుడే అట్టి కృష్ణున్ని మనము దర్శించగలుగుతాము.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement