Friday, June 14, 2024

Maharashtra – కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో పేలిన బాయిల‌ర్ – న‌లుగురు దుర్మ‌ర‌ణం …

మ‌హారాష్ట్ర థానే డొంబివాలిలో ఉన్న ఓ కెమికల్‌ ఫ్యాక్టరిలోని బాయిలర్‌లో గురువారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఫ్యాక్టరిలో భారీగా మంటలు చెలరేగాయి. పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. భారీగా ఎగిసిన పడిన మంటలు మరో రెండు బిల్డింగ్‌లకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. 25 మంది గాయపడ్డారు.
దీంతో సమాచారం అదుకున్న ఫైర్‌ సిబ్బంది ఘటనాస్థలాని​కి చేరుకొని 15 ఫైర్‌ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు. ఫ్యాక్టరి భవనంలో చిక్కుకున్న 8 మందిని సురక్షితంగా రెస్క్యూ చేసి పోలీసులు కాపాడారు. ఈ ప్రమాదంలో పలు వాహనాలు, పక్కనే ఉన్న కొన్ని ఇళ్లు పాక్షికంగా కాలిపోయాయి… దీనిపై మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement