Thursday, May 30, 2024

Vijayawada – ప్ర‌ధాని ర్యాలీలో భ‌ద్ర‌తా వైఫ‌ల్యం .. చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిజిపికి లేఖ

అమ‌రావ‌తి .. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల మొదటివారంలో విజయవాడలో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సీరియస్‌గా స్పందించింది. బాధ్యులుపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి ఘాటైన లేఖ పంపింది కేంద్రం. ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీకి 45 నిమిషాల ముందు ర్యాలీ ప్రారంభం, చివరలో డ్రోన్స్ ఎగురవేశారు.

పీఎం భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ ముందుగానే ప్రధాని రోడ్ షో ప్రాంతం నో ఫ్లై జోన్‌గా ప్రకటించింది. అయినప్పటికీ రాష్ట్ర పోలీసులు వినిపించుకోలేదు. ప్రధాని రోడ్ షోకు 45 నిమిషాల ముందు డ్రోన్‌లను గుర్తించిన ఎస్పీజీ.. ఒక డ్రోన్‌ను డిస్‌ఫ్యూజ్ చేసేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర పోలీసులకు చెప్పినా వారు పెద్దగా పట్టించుకోలేదు. డ్రోన్స్‌ను ఎగురవేశారు. ఇది భద్రతా వైఫల్యమేనని కేంద్ర హోంశాఖ ఇప్పుడు తేల్చింది. వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement