Sunday, June 16, 2024

Nagole | రోడ్డు వేయండి మ‌హాప్ర‌భూ.. నీటి కుంట‌లో మ‌హిళ నిర‌స‌న..

నాగోల్, (ఫ్రభ న్యూస్) : నాగోల్ బండ్లగూడ ఆనంద్ నగర్ చౌరస్తాలో కుంట్లూర్ కు చెందిన నిహరిక అనే మహిళ (గురువారం) తెల్లవారుజామున కురిసిన వర్షానికి పాడైన రోడ్డు గుంటలో నిలిచిన వర్షపు నీటిలో కూర్చొని వినూత్న నిరసన తెలిపింది. చాల కాలం నుంచి రోడ్డు పాడై పోయి ఉందని దీనిని పట్టించుకునే వారే లేరని ఈ వర్షాలకు రోడ్డు మరింత పాడయ్యిందని….. రాత్రి వేళలో పాదాచారులు, వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని మహిళా ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ రోడ్డు గుండానే ఓఆర్ఆర్ కు భారీ వాహనాలు నిత్యం వందల సంఖ్యలో చేరుకుంటాయని ఏ క్షణానానా ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని పాదచారులు బిక్కు బిక్కుమంటూ నడక సాగిస్తారని వాపోయారు. ఇటీవల ప్రమాదాలు కూడ జరిగి కొందరి ప్రాణాలు కూడ పోయాయని పేర్కొన్నారు.

వెంటనే, కొత్త రోడ్డు వేయాలని, రోడ్డుపై నిలిచిన నీటిలోనే కూర్చొని నిరసన తెలిపింది. మహిళలకు ట్రాఫిక్ పోలీసులు నచ్చ చెప్పిన వినలేదు. జిహెచ్ఎంసి అధికారుల, ప్రజాప్రతినిధులు నుండి స్పష్టమైన హామీ ఇస్తేనే నిరసన విరమిస్తానని భీష్మించుకుని కూర్చుంది.

ఘటన స్థలానికి చేరుకున్న కార్పొరేటర్..

విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ ఘటన స్ధలానికి చేరుకుని ఇది వరకే ఈ రోడ్డు విషయంలో సంబంధిత అధికారులతో మాట్లాడామని శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా, ఎన్నికల కోడ్ కారణంగా, మరికొన్ని కారణాలతో పని ఆలస్యమైనదని తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని హమీ ఇచ్చారు. ఈ సందర్బంగ సర్కిల్ జీహెచ్ఎంసీ ఏఈ రాకేష్ సిబ్బందితో చేరుకొని కొన్ని గుంతలను కంకరతో నింపి పూడ్చారు. సాధ్యమైనంత త్వరితగతిన పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement