Wednesday, May 8, 2024

దత్తం భజే! గురుదత్తం భజే!

శ్లో|| దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం!
ప్రసన్నార్తి హరం వందే స్మర్తుృగామీ సనోవతు!

1. కం. అనసూయయు నత్రిమునియు
జననీ జనకులుగ దాను సంభవమందెన్‌
తనలో హరిహర బ్రహ్మలు
దనరగ లోకాల బ్రోవ దత్తగురుండై.

2. సీ|| గురుదత్తు దెలియగ గురుతర కష్టంబు
భక్తుల కష్టాలు బడయ జేసి
కఠినపరీక్షల కల్మషరహతమౌ
పరిపూర్ణ శరణంపు పాపు నిచ్చు
లౌకిక సుఖములన్‌ లభించు వరముల
దత్త దేవుడెపుడు రిత్తవరచు
ఆత్మసాక్షాత్కార మాత్మశుద్ధియు గోరు
నిజమైన శిష్యుల నెప్పుడు బ్రోచు

తే.గీ: దత్తపాద ద్వయమును తలను దాల్చి
నిత్య నిష్కామకర్మల నెవరునతని
ధ్యానమొనరింతురో వారు ధన్యులగుట
తథ్యమటువంటి వారిదె దత్తపథము.

3. ఉ|| దత్తుని నవ్వుదివ్యమయి దబ్బర ¸°జగమున్‌ హసించుచున్‌
మెత్తని సూక్తులన్‌ మనకు మేలగు నిత్యవిరాగ శౌముషిన్‌
సత్తువగా నొసంగి నిజ శాశ్వత స్వచ్ఛమహావిభూతులన్‌
చిత్తమునింపు: నాతని వశీకరణంబున గల్గు సద్గతుల్‌.

- Advertisement -

4. సుగంధి:
అత్రిపుత్రు నాది దేవునంతరంగమందునన్‌
మిత్రుగా దలంచి ధ్యాన మేర్పడంగ జేసినన్‌
శత్రువర్గమైన ‘యారు’ జచ్చులోన: దివ్యమౌ
భ్రాతృ భావ మావరించు బ్రాణికోటి: సత్యమై!

5. కం. దత్తాత్రేయుని మార్గము
ఇత్తరి సమదర్శనంబు నెంతయుజూపున్‌
చిత్తములోని వివక్షలు
చిత్తుగ నశియించి, యోగ సిద్ధత గలుగున్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement