Thursday, April 18, 2024

వాల్తేరు వీర‌య్య రిలీజ్ డేట్ ఎనౌన్స్.. ట్రెండింగ్ లో పోస్ట‌ర్

మెగాస్టార్ చిరంజీవి వ‌రుస చిత్రాల‌తో దూసుకుపోతున్నారు. ఆయ‌న న‌టిస్తోన్న తాజా చిత్రం వాల్తేరు వీర‌య్య‌.ఈ చిత్రం రిలీజ్ డేట్ ని మేక‌ర్స్ ప్ర‌క‌టించిరు. జ‌న‌వ‌రి13న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది వాల్తేరు వీర‌య్య మూవీ. ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కు బాబీ (కేఎస్ ర‌వీంద్ర‌) దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రంలో మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శృతిహాస‌న్ ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తోంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌ అందిస్తున్నారు. ఇప్పటికే మేకర్స్‌ లాంఛ్‌ చేసిన టైటిల్‌ టీజర్‌, బాస్ పార్టీ సాంగ్‌ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతి కానుకగా రానుండగా.. విడుదల తేదీని ప్రకటించారు. ఈ సంక్రాంతికి థియేటర్లలో మాస్‌ మూలవిరాట్ దర్శనమయ్యే సమయం.. జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా వాల్తేరు వీరయ్య గ్రాండ్‌గా విడుదల కాబోతుందంటూ విడుదల చేసిన పోస్టర్‌ ట్రెండింగ్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement