Tuesday, May 28, 2024

కొండగట్టు దేవాలయానికి రూ.100కోట్లు మంజూరు.. కేసీఆర్

కొండగట్టు దేవాలయానికి రూ.100కోట్లు మంజూరు చేస్తున్నానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. జగిత్యాల సమీకృత కలెక్టరేట్‌కు ప్రారంభోత్సవం చేశారు. అంతకు ముందు కార్యాలయానికి వచ్చిన సీఎంకు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కార్యాలయాన్ని కేసీఆర్‌ ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… తెలంగాణలో అద్భుత పుణ్యక్షేత్రాలున్నాయన్నారు. బండలింగాపూర్ ను మండల కేంద్రంగా చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది కాబట్టి జగిత్యాల జిల్లా ఏర్పడిందన్నారు. కేసీఆర్ ఉన్నంత వరకూ రైతుబంధు, రైతు బీమా ఆగదన్నారు. మద్దుట్ల వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తామన్నారు. పోచారం, నారాయణపూర్ రిజర్వాయర్లను పూర్తి చేస్తామన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement