Thursday, April 25, 2024

సైన్స్,మాథమేటిక్స్, ఎన్విరాన్మెంట్ ప్ర‌ద‌ర్శ‌ను ప్రారంభించిన.. మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి

వికారాబాద్ ప్రభ: న్యూస్ : జిల్లా కొత్తగడిలో 50వ జిల్లా స్థాయి సైన్స్,మాథమేటిక్స్, ఎన్విరాన్మెంట్ ప్రదర్శనను ప్రారంభించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ…గ్రామీణ ప్రాంత విద్యార్థులలలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయటానికి ఇలాంటి సైన్స్ ఫేర్ లుఎంతగానో దోహదం చేస్తాయని అన్నారు.వికారాబాద్ జిల్లా నుండి అంతర్జాతీయ స్థాయిలో రాణించిన విద్యార్థిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాక్షించారు. వికారాబాద్ జిల్లాలో సైన్స్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు.సమస్యతోనే పరిష్కారం పుట్టుకు వస్తుందని,కరోనా సమయంలో మందుల సరఫరా ఎలాంటి ఆటంకం లేకుండా సాగేలా,త్వరితగతిన చేరేలా డ్రోన్ సహాయంతో జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టడం జరిగిందన్నారు.వ్యాపారాలు,పారిశ్రామిక వేత్తలుగా రాణించాటానికి ప్రభుత్వం టి హబ్ ద్వారా కృషి చేస్తుందని.. ఇందులో విద్యార్థుల కోసం కొంత స్పెస్ కేటాయిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారన్నారు.

స్వంత ఆలోచనలతో రండి పరిశ్రామిక వేత్తలుగా ఎదాగాలన్నదే ప్రభుత్వ అభిమతం అన్నారు. పరిశ్రమలు స్థాపించి,తాము ఎదగటమే కాకుండా నలుగురికి ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు.మంత్రి కేటీఆర్ ఇంటింటా ఇన్నోవేషన్ కార్యక్రమంతో అనేక నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారని మంత్రి అన్నారు.ఆసక్తి ఉన్న రంగాల్లో రాణించేలా విద్యార్థులను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు.ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని పెద్ద ఎత్తున గురుకులాలు ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థి పై ఒక లక్ష.. 20వేలు ఖర్చు చేస్తుందన్నారు.ప్రదర్శనను లాంఛనంగా ప్రారంభించిన అనంతరం మంత్రి తిలకించారు.భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా,నూతన ఆవిష్కరణలు చేసి వ్యాపారవేత్తలుగా రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు,కాలే యాదయ్య ,జడ్పీ వైస్ ఛైర్మన్ విజయ్ కుమార్ ,రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ ,అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ ,డి ఈ ఓ రేణుకా దేవి ,మునిసిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement