Tuesday, May 14, 2024

చాణక్యుడు చూపినకార్య సాధనా మార్గాలు

చాణక్యుడు రచించిన నీతిశాస్త్రం ‘చాణక్య నీతి’ పేరుతో ప్రసిద్ధి చెందింది. సంస్కృతంలో ఆయన రాసిన పుస్తకాన్ని హిం దీలోకి, తెలుగులోకి పలువురు అనువదించారు. అనువాదమ య్యాయి. ప్రముఖ రచయిత, అనువాదకులు, సంస్కృత పండి తులు కీ.శే.పుల్లెల శ్రీరామచంద్రుడు అనువాద గ్రంథం ‘చాణక్య నీతిసూత్రాణి’లో ఇష్టమైన పనులను సాధించడానికి చాణక్యు డు చెప్పిన ఉపాయాలు నుంచి కొన్ని-
యో యస్మిన్‌ కర్మణి కులస్తం తస్మిన్నేవ యోజయేత్‌
ఎవడికి ఏ పనిలో నేర్పు ఉందో వాడికి ఆ పనే ఇవ్వాలి.
దు:సాధమపి సుసాధం కరోత్యు పాయజ్ఞ:
ఉపాయం తెలిసినవాడు కష్టమైన పనికూడ సులువుగా చేస్తాడు
అజ్ఞానినా కృతమపి నబహుమన్తవ్యమ్‌; యాదృచ్ఛికత్వాత్‌!
తెలివితక్కువవాడు ఏ పనైనా సాధించినా వాణ్ణి మెచ్చుకోకూడ దు. ఎందుకంటే అతడా పని యాదృచ్ఛికంగా చేయగలి గాడు.
సిద్ధస్యైవ కార్యస్య ప్రకాశనం కర్తవ్యమ్‌!
పని జరిగిన తరువాతనే బైటకు చెప్పాలి.
జ్ఞానవతామపి దైవ మానుషదోషాత్‌ కార్యాణి దుష్యన్తి!
ఎంత తెలివైనవాళ్ళ పనులైనా దైవ దోషంచేత, మానవ దోషం చేత చెడిపోతుం టాయి.
దైవం దోషం శాన్తి కర్మ ణా వినివారయేత్‌!
దైవదోషాన్ని శాంతి క ర్మలు చేసి నివారించు కోవాలి.
మానుషీం కార్యవిపత్తిం కౌశలేన వినివారయేత్‌!
మనుష్యులవల్ల వచ్చే కార్య విఘాతాన్ని నేర్పుతో తప్పించుకో వాలి.
కార్య విపత్తౌ దోషాన్‌ వర్ణయన్తి బాలిశా:!
పనులు చెడిపోతే మందబుద్ధులు తమ ప్రయత్న లోపం అని చెప్పకుండా ఏవేవో దోషాలు వర్ణించి చెపుతారు.
కార్యార్థినా దాక్షిణ్యం న కర్తవ్యమ్‌!
పని కావలసినవాడు అనవసరంగా మొహమాట పడకూడదు.
క్షీరార్థీ వత్స: మాతురూధ: ప్రతిహన్తి!
పాలుకోరే లేగదూడ తల్లి పొదుగు పొడుస్తుంది.
అప్రయత్నాత్‌ కార్యవిపత్తిర్భవేత్‌!
సరిగా ప్రయత్నం చేయకపోతే కార్యం చెడిపోతుంది.
న దైవమాత్ర ప్రమాణానాం కార్యసిద్ధి:!
అంతకీ దైవమే ఉన్నదనుకొనేవాళ్ళ పనులు జరగవు.

Advertisement

తాజా వార్తలు

Advertisement