Monday, May 20, 2024

బ్రహ్మాండ నాయకుని బ్రహ్మౌత్సవం

తిరుమలలో నేటి (అక్టోబరు 15) నుంచి బ్రహ్మాండ నాయకుని నవరాత్రి బ్రహ్మోత్సవా లు 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. చాంద్రమానం ప్రకారం ప్రతి మూ డు సంవత్సరాలకు ఒకసారి అధికమాసం వస్తుంది. ఇలా వచ్చిన సందర్భాల్లో కన్యా మాసం (భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహ ణం ఉండవు. ప్రధానంగా అక్టోబరు 19న గరుడ వాహనం, 20న పుష్పక విమానం, అక్టోబరు 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం జరుగనున్నాయి. ఉదయం వాహన సేవ 8 నుండి 10 గంట ల వరకు, రాత్రి వాహనసేవ 7 నుండి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహన సేవ రాత్రి 7 నుండి 12 గంటల వరకు జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో జరిగే వాహన సేవల వైశిష్ట్యా న్ని తెలుసుకుందాం. శ్రీవారి శోభను దర్శించుకుందాం.
శనివారం (14వ తేదీ) రాత్రి 7 గం.లకు అంకురార్పణ నిర్వహించారు. వైఖానస ఆగమం లోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహంచే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి సేనాధిపతి అయిన శ్రీవిష్వక్సేనులవా రిని ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. ఆ తరువాత అంకురార్పణం, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.
నేడు (15వ తేదీ) ఉదయం 9 గం.లకు శ్రీవా రికి బంగారు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు అయిన నేటి ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారు బంగారు తిరుచ్చిపై ఆల య నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షిస్తారు.

పెద్ద శేష వాహనం (రాత్రి 7 గంటలకు)

నేటి రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మల యప్పస్వామివారు ఏడు తలల స్వర్ణ శేష వాహనంపై (పెద్ద శేషవాహనం) తిరు మాడ వీధులలో భక్తులను అనుగ్రహ స్తారు. ఆదిశే షుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహ తుడు. రామావతా రంలో లక్ష్మణు డుగా, ద్వాప రయుగంలో బలరాముడు గా శ్రీమన్నారా యణుడికి మిక్కిలి సన్నిహతంగా ఉన్న వాడు శేషుడు. శ్రీ వైకుంఠంలోని నిత్య సూరులలో ఇతడు ఆద్యుడు, భూభారాన్ని వహంచేది శేషుడే. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి. మాడ వీధులలో శ్రీదేవి భూదేవిలతో కలిసి పెద్ద శేషవాహనంపై విహరించే శ్రీ మలయప్ప స్వామిని దర్శించుకుని తరిద్దాము.

Advertisement

తాజా వార్తలు

Advertisement