Tuesday, May 14, 2024

ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రుల శోభ

భవానీ భావనాగమ్యా భవారణ్య కుఠారికా
భద్ర ప్రియా భద్రమూర్తి ర్భక్తసౌభాగ్యదాయినీ!!

సర్వ మంగళమాంగల్యే శివే సర్వార్థసాధికే
శరణ్య త్య్రమ్బకే దేవి నారాయణి నమోస్తుతే!!

శ్రీమాతను ఆరాధించే విధానమును శ్రీ మార్కండేయ మహర్షికి బ్రహ్మ చెప్పినట్లు మనకు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆశ్వయుజ శుద్ధ పాడ్య మి నుండి దశమి వరకు శరన్న వరాత్రులుగా మనం జరు పుకునే దసరా ఉత్సవాలు శక్తి రూపిణి అయిన దుర్గామాతను వివిధ రూపాలలో ప్రత్యేక పూజలతో పూజిస్తాము. శక్తి ఆరాథన చేయదలచినవారు ప్రథమంగా గణపతిని పసుపుతో ప్రతిష్టించి నిర్విఘ్నంగా నవరాత్రుల దుర్గాపూజ పూర్తిగావించి అఖండ ఫలితాలను ఆ తల్లి అను గ్రహంతో పొందాలనే సంకల్పం చెప్పుకోవాలి. నవ రాత్రి కలశను ప్రతిష్టించి, నవధా న్యాలను కూడా ఒక పాత్రలో ప్రక్కనే పెట్టుకుని పూజా జలమును అందులో నిక్షిప్తం చేయాలి. అవి మొలకలు వచ్చి చక్కగా పెరిగినట్లయితే అమ్మ ఆశీర్వాదము మనకు లభ్యమైనట్లుగా భావించవచ్చును. నవరాత్రులు శక్తికి ప్రతిరూపం కాబట్టి సక్రమంగా జరిపే పూజ అద్భుతమైన ఫలితాలను ప్రసాదిస్తుంది. అదేవిధంగా ఆచార విరుద్ధంగా సాగించే పూజలతో చెడు ఫలితాలు కూడా చవిచూడ వలసి వస్తుంది. ఎంతో జాగరూకతతో వ్యవహరించాలి. కలశ స్థాపన వీలుకాకపోయి నా నవరాత్రులు తొమ్మిది రోజులు మామూలుగా కూడా తల్లిని పూజింపవచ్చును. నైవేద్యం విషయంలో కూడా శక్తి కలిగిన విధంగా చేయవచ్చును. మనం గుర్తుంచు కోవలసిన విషయం ఏమంటే భక్తి ప్రధాన ము. ఆరోగ్య రీత్యా వీలు కుదరని వారు ఉద యం అల్పాహారం తీసుకుని పూజ నిర్వ#హంచవచ్చును. శరీరం నిలబడితేనే ప్రశాంత మైన చిత్తంతో పూజ చేయగలుగుతాము.
పాడ్యమి నాడు స్వర్ణకవచ అలంకారంతో దుర్గాదేవిని విధివిధానాలతో, శోడశోప చార పూజలతో పూజిస్తారు. ఈరోజు అమ్మ పూజకు చేమంతి పూలను వినియోగిస్తారు. దుర్గా అష్టోత్తర నామములతో పూజచేసి, పులిహోర నైవేద్యంగా సమర్పించాలి.
నేడు విజయవాడ కనకదుర్గమ్మ శ్రీస్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు.
దేవీ! త్వం భక్తసులభే సర్వకార్యవిధాయినీ!
కలౌ హ కార్యసిద్ధ్యర్థ ముపాయం బ్రూ#హ యత్నత:!!
దేవీ! నీవు భక్తులను సులభంగా అనుగ్ర#హంచే కరుణదయార్ద్ర హృదయముతో ఈ కలియుగంలో ప్రయత్న లోపం లేకుండా నిన్ను ఆశ్రయించినవారిని ఆదుకునే దుర్గాదేవిగా ఈ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్నావు. ఆశ్రయించిన భక్తులకు సర్వకాల సర్వావస్థల యందు విజయము నిచ్చుదవు అని ఈశ్వరుడు తెలియజేసెను. ఎవరైతే వారి #హృదయంలో ఆ దుర్గమ్మను ప్రతిష్టించుకుంటారో వారి జీవితం నందనవనమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement