Monday, April 29, 2024

ENG vs AFG : ఇంగ్లండ్ టార్గెట్ 285 పరుగులు

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇవాళ అఫ్ఘనిస్థాన్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య వరల్డ్ కప్ వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆప్గనిస్తాన్ జట్టు 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్ మెన్లు రహ్మనుల్లా గుర్బాజ్ 80 పరుగులు, ఇక్రమ్ అలిఖిల్ 58 పరుగులు, ఇబ్రహీం జడ్రాన్, ముజీబ్ ఉర్ రహిమాన్ లు చెరో 28 పరుగులు చేశారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లండ్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే నిర్ణీత 50 ఓవర్లలో 285 పరుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement