Wednesday, May 8, 2024

భక్తుల ప్రేమే ముఖ్యం

భగవాన్‌ రమణ మహర్షి తరచూ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తూ ఉండేవారు. ఆ గిరి ప్రదక్షిణలో అనేక మంది భక్తులు కూడా వెంట ఉండేవారు. దారిలో ఒకచోట ఒక వ్యక్తి మజ్జిగ కలిపిన అన్నం భగవాన్‌కు సమర్పించేవాడు. దానిని భగవాన్‌ సంతోషంగా స్వీకరించేవారు. అలా చాలా సార్లు జరిగింది. ఒకరోజు గిరి ప్రదక్షిణ చేస్తున్న రమణులకు తరచూ తనకు అన్నం పెట్టే వ్యక్తి కనిపించకపోవడం గమనిం చారు. అప్పుడు రమణులు తనవెంట వచ్చిన భక్తులను గిరి ప్రదక్షిణ ముందుకు కొనసాగించమని చెప్పి ఆ వ్యక్తి గురించి వేరే మార్గంలో వెతకసాగారు. అలా ఎందుకు, ఎక్కడకు వెళు తున్నారో మిగతావారికి తెలియలేదు. చివరికి ఒకచోట ఆ అ న్నం పెట్టే వ్యక్తి కనిపించాడు. ఈరోజు తనకు ఎందుకు భోజ నం తీసుకురాలేదని రమణులు అడిగారు. అతను సమాధా నం చెప్పటానికి సిగ్గుపడ్డాడు. తన పేదరికానికి చింతిస్తూ, కన్నీ టితో తనవద్ద ఆ రోజు అన్నము, మజ్జిగ లేదన్నాడు.
”సరే! నీ దగ్గర ఏది వుంటే అది పెట్టు!’ అని రమణ మహర్షి అన్నారు. తనవద్ద గంజే ఉందని ఆ భక్తుడు చెప్పాడు. ‘అదే ఇ వ్వు’ అని దోసిలి పట్టారు. ఇంతలో భగవాన్‌ వెంట వచ్చిన భక్తులు అక్కడకు రావడం జరిగింది. ఆ వ్యక్తి ఇచ్చిన ముంత నుంచి భగవాన్‌ గంజిని త్రాగడం అందరికీ ఆశ్చర్యము, ఆనం దం కలిగించాయి. సత్పురుషులకు భక్తుల ప్రేమ కావాలి కానీ ఆడంబరాలు కాదు. సత్పురుషులు, యోగులు, సద్గురువు లు… ఇలా పేరేదైనా వారంతా భగవంతుని ప్రతిరూపాలే. ఆ భగవానుడి కోసం ఈ లోకంలో ఉద్భవించి చెడు మార్గంలో ప్రయాణించేవారిని మంచిమార్గంలో ప్రయాణించేలా చేయ డమే వీరి లక్ష్యం. భగవంతుడు కూడా ఒకరకంగా వీరికి లోబడి ఉంటాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపమే సద్గురువు. ఒక్క సద్గురువుకు నమస్కరించినా త్రిమూర్తులకు నమస్కరించిన ఫలితం కలుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement