Sunday, May 19, 2024

యోగక్షేమం వహామ్యహమ్‌

ఓపర్యాయం ఓ భక్తుడు తోడెవరూ లేని ఒంటరివాడినైపో యానని చాలా దిగులు పడ్డాడు. తోడు కోసం దేవుడ్ని రాత్ర నక పగలనక అదే పనిగా ప్రార్ధించాడు. దేవుడు ప్రత్యక్షమై ”భయ పడకు. నీకు ఏం కావాలో కోరుకో ఇస్తాను.” అన్నాడు.
”స్వామీ! నా అన్న వారెవరు లేకుండా ఒంటరినైపోయాను. నా కు అండగా, నువ్వు నాతో, నాకు తోడుగా నీడగా ఉండాలి. తోడుగా ఉండి నా సంగతులన్నీ నువ్వే చూసుకోవాలి.” అని దేవుడ్ని కోరాడు భక్తుడు.
దేవుడు ”సరే అలాగే భయపడకు అన్నాడు. నేను నీతో ఉంటాను. నీ వీపు వెనుకనే ఉంటాను. నీతోపాటు వస్తూ ఉంటాను. కంగారు పడకు.” అని అభయమిచ్చి అదృ శ్యమై పోయాడు దేవుడు.
కొంత కాలం తర్వాత నా వెనక దే వుడు వస్తున్నాడో, లేదో అనే అను మానం భక్తుడికి వచ్చింది. తన వెనక దేవుడు ఉన్నాడో లేడో తెలుసు కోవాల నుకుని వెనకకి పూర్తిగా తిరిగి చూసా డు. దేవుడు అక్కడ భక్తుడికి కనిపించ లేదు. ఏం జరిగి ఉంటుందో ఎంత ఆ లో చించినా అంతుపట్టలేదు. చివరికి దేవడు అబద్ధం చెప్పాడు అనే నిర్ణ యానికి వచ్చాడు. చేసేదేమీ లేక మళ్ళీ దేవుడ్ని ప్రార్ధించాడు. దేవుడు ప్రత్యక్ష మయ్యాడు. ”స్వామీ! నువ్వు నాతో ఉంటానన్నావు. నేను వెనక్కి తిరిగి చూస్తే నువ్వు అక్కడ లేవు. అబద్ధం చెప్పటం భావ్యమా?” అని దీనంగా దేవుడ్ని ప్రశ్నించాడు భక్తుడు.
”అమాయకుడా! ఇదా నీ సమస్య. ఏడ్చినట్టుంది నీ తెలివి? నీ వీపు వెనకాల ఉంటానని కదా నేను చెప్పాను. నేను ఉన్నానో లేదో చూడాలని నువ్వు వెనక్కి తిరిగావు. నువ్వు వెనక్కి తిరిగినప్పుడు నీ వీపు కూడా తిరుగుతుంది. నీ వీపు తిరుగుతున్నప్పుడు, దానితో పాటు నేను కూడా, నీ వీపు వెనక్కి తిరిగాను. నీకెలా కనిపిస్తాను?” అసలు విషయం వివరించాడు దేవుడు.
భక్తుల యింట.. వెంట… జంట ఉంటానని ప్రతి అవతారం లోను, అవసరమైన ప్రతి సందర్భంలోనూ, భగవంతుడు పదేపదే చెబుతున్నాడు. అయినా మనకెన్నో సందేహాలు. దేవుని గురించి దేవుని ఉనికి గురించి ఎన్నెన్నో అనుమానాలు.
ఓ పర్యాయం ఓ క్షురకుడికి యిలాంటి అనుమానమే వచ్చింది. అప్పుడతను ఓ పండితునికి క్షురకర్మ చేస్తున్నాడు. ఆ పండితుడ్ని క్షురకుడు ”అయ్యా! దేవుడనే వాడు ఉన్నాడంటారు. నిజంగా ఉన్నా డంటారా?” అని ప్రశ్నించాడు. తన సందే#హం తీర్చమన్నాడు.
”ఈ సందే#హం ఎందుకొచ్చింది నీకు.” అని అడిగాడు పండితు డు క్షురకుడ్ని.
”అయ్యా! మీకు, నాకు, ఈ భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కరికీ, ఎన్నో కష్టాలు ఉన్నాయి. దేవుడు మన కష్టాలు తీర్చాలి కదా? మన కష్టాలు తీరాలి కదా? మన కష్టాలు తీరడం లేదు. అందుకే ఈ సందే#హం వొచ్చిందయ్యా!.” అని చెప్పాడు క్షురకుడు.
మర్నాడు యిద్దరూ ఆ పట్టణంలో బాగా రద్దీగా ఉండే ఓ కూడలి దగ్గరకి వెళ్ళారు. అక్కడ జుత్తు ఒత్తుగా పెరిగిపోయి, గెడ్డాలు మీసా లతో ఏమాత్రం కేశ సంస్కారం చేసుకోని చాలామంది వాళ్ళకు కనిపించారు. అప్పుడు పండితుడు ”ఏవయ్యా! వాళ్ళంతా కేశ సం స్కారం చేసుకోకుండా అడ్డదిడ్డంగా, రెల్లు పొదల్లా జుత్తు పెంచుకుని పిచ్చివాళ్ళలా ఉన్నారు కదా! నువ్వు క్షురకుడివి. ఈ ఊరి వాడివి. వాళ్ళకి క్షురకర్మ చేసే బాధ్యత నీకు లేదా? నీ బాధ్యతని నువ్వు నిర్వ ర్తించలేవా?” అని కొంచెం కఠినంగా నిష్టూరంగా ప్రశ్నించాడు క్షుర కుడ్ని.
”ఇందులో నా తప్పేంటయ్యా? తమ జుత్తు గడ్డం మీసం సరి చేసుకుందామని, జుత్తు కత్తిరించుకునేందుకు ఎవరైనా నా దగ్గర కు వస్తే, నేనా పని చేయగలను. ఒకవేళ వాళ్ళు నా దగ్గర కు రాలేని పరిస్థితి అయితే, నన్ను రమ్మనమని కబురు చేస్తే, వాళ్ళ దగ్గరకు వెళ్ళి ‘క్షుర కర్మ’ చేసి పెట్టగలను. వాళ్ళెవరూ రాలేదు. నన్ను రమ్మనమని ఎవ రూ పిలవలేదు. నేనేం చేసేదయ్యా?” జవాబిచ్చాడు క్షురకుడు.
”అంతేనంటావా?” అడిగాడు పండితుడు.
”అవును” అన్నాడు క్షురకుడు.
”భగవంతుడు కూడా అంతేనయ్యా! మనం బాధలలో, కష్టా లలో ఉన్నప్పుడు, భగవంతుడ్ని రమ్మనమని, మన కష్టాలు తీర్చ మని ఆ భగవంతుడిని పిలిస్తే, పిలవగలిగితే, ఆ భగవంతుడు వచ్చి మన కష్టాలు తీర్చుతాడు. రమ్మనమని ఆయనను మనం పిలవనప్పు డు, పిలవలేనప్పుడు ఆయన ఎలా వస్తాడు? కష్టాలు ఎలా తీరుస్తా డు? మనలను ఎలా కాపాడతాడు?” క్షురకునికి అర్ధమయ్యేలా చెప్పి, క్షురకుని సం దేహాన్ని నివృత్తి చేసాడు పండితుడు.
భగవంతుడు భావప్రియుడు. మన భావాన్ని చూస్తాడు. బాహ్యా న్ని చూడడు. భక్తిని చూస్తాడు. కానీ శక్తిని చూడడు. చిత్తాన్ని చూస్తా డు. కానీ విత్తాన్ని చూడడు. నీతిని చూస్తాడు. మ న జాతిని చూ డడు. మన గుణాన్ని చూస్తాడు. కానీ కులాన్ని చూడడు. అంత రంగాన్ని చూస్తాడు. ఆర్భాటాలను, ఆస్తిపాస్తులను చూడడు .భగ వంతుడు నచ్చే మార్గంలో మనం నడవాలి. ఆయన మెచ్చే రీతిలో మనం మెల గాలి. ఆయనను ఒప్పించాలి. ఆయనను మెప్పించాలి.
”అనన్యాశ్చిన్త యన్తోమాం యే జనా: పర్యుపాసతే
తేషాం నిత్యాభి యుక్తానాం యోగక్షేమం వహామ్య#హమ్‌ ”

– రమాప్రసాద్‌ ఆదిభట్ల
93480 06669

Advertisement

తాజా వార్తలు

Advertisement