Monday, April 29, 2024

శ్రీశైలంలో భక్తజన సందోహం..

మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి శోభ కనిపిస్తోంది. ఆల‌యాల‌న్నీ శివ నామస్మరణతో మార్మోగుతున్నాయి. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్దఎత్తున శివాలయాలకు పోటెత్తారు. శివయ్యకు ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మహ శివరాత్రి సందర్భంగా శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు ఆలయ క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. శ్రీశైలం ఆలయం శివభక్తులతో నిండిపోయింది.. శ్రీశైలంలో స్వామివారి దర్శనానికి సుమారు ఆరుగంటలు సమయం పడుతోంది. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు స్వామి అమ్మవార్ల ను దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొంటున్నారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా 19న సాయంత్రం 5 గంటలకు రథోత్సవం.. రాత్రి 8 గంటలకు తెప్పోత్సవం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 21 వరకు అన్ని ఆర్జిత సేవల టికెట్లను ఆపేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాలను పుష్పాలు, విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పది లక్షల మంది భక్తులు బ్రహ్మోత్సవాలకు వస్తారన్న అంచనా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement