Friday, April 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 48

సహజం కర్మ కౌంతేయ
సదోషమపి న త్యజేత్‌ |
సర్వారంభా హి దోషేణ
ధూమేనాగ్నిరివావృతా: ||

తాత్పర్యము : అగ్ని పొగచే ఆవరింపబడినట్లు ప్రతి యత్నము కూడా ఏదియో ఒక దోషముచే ఆవరింపబడి యుండును. అందుచే ఓ కౌంతేయా! దోష పరిపూర్ణమైనను తన సహజ కర్మను ఎవ్వడును త్యజింపరాదు.

భాష్యము : త్రిగుణములలో నున్న వ్యక్తి తన గుణములను అనుసరించి ఏ కార్యమును చేసినా అవి కలుషితమై ఉండును. బ్రాహ్మణులు యజ్ఞములను నిర్వహించునపుడు జంతువులను బలి ఇవ్వవలసి వచ్చును. క్షత్రియులు శాంత స్వభావమును వీడి శత్రువులతో పోరాడవలసి వచ్చును, వైశ్యులు లాభములను కప్పిపుచ్చవలసి వచ్చును. అలాగే శూద్రులు క్రూరుడైన యజమానికి సేవ చేయవలసి వచ్చును. అయితే ప్రతి వ్యక్తి తమ గుణములను అనుసరించి బాధ్యతలను కొనసాగించవలెను. పొగతో కూడుకొని ఉన్నా అగ్ని పవిత్రమైనది మరియు ఎంతో ఉపయోగకరమైనది. అలాగే లోపములున్నప్పటికీ ప్రతి ఒక ్కరూ తమ బాధ్యతలను భగవంతుని ప్రసన్నార్థము నిర్వహించినట్లయితే ఆ దోషములు పవిత్రీకరించబడతాయి.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement