Saturday, April 27, 2024

ఆశ్రిత వరదాయినీ నవెూనమః

మనిషిని మనీషిగా తీర్చిదిద్దేది జ్ఞానము. విద్య, చదువు, జ్ఞానము పర్యాయ పదాలు. అటువంటి విద్యకు, జ్ఞానానికి అధిదేవత జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీదేవి. ఆ మహాసరస్వతి పుట్టినరోజు మాఘ శుక్ల పంచమి. దీన్నే వసంత పంచమి అని కూడా అంటారు. యావద్భారతావనిలో అందరూ ఆ తల్లి కరుణా కటాక్షాలు పొందడానికి జరిపే పర్వదినమే వసంత పంచమి. క్షీరసాగర మదన సమయంలో ఈ రోజునే మహాలక్ష్మి ఆవిర్భవించిన కారణంగా
మదన పంచమి అని కూడా పిలుస్తారు.

నేడు
వసంత పంచమి

”సరస్వతీం శుక్లవర్ణాం సుస్మితాం సుమనోహరామ్‌
కోటిచంద్ర ప్రభా ముష్ట పుష్ట శ్రీయుక్త విగ్రహమ్‌
వహ్ని శుద్ధాంశుకాధానం వీణా పుస్తక ధారిణీమ్‌
రత్న సారేంద్ర నిర్మాణ నవ భూషణ భూషితామ్‌”
జ్ఞానశక్తికి అధిష్ఠాన దేవత సరస్వతీమాత. జ్ఞాన, వివేక, దూరదర్శిత్వ, బుద్ధిమత్తత, విచార శీలత్వాదుల్ని శ్రీవాణి అనుగ్రహిస్తుంది. సత్త్వరజస్తమో గుణాలను బట్టి అమ్మల గన్న యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన జగన్మాతను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా కీర్తిస్తారు. ఈ ముగ్గురిలో సరస్వతీదేవి పరమ సాత్వికమూర్తి. అహింసా దేవి. ఆమెకు యుద్ధంచేసే ఆయుధాలు ఏమీ ఉండవు. బ్రహ్మ వైవర్త పురాణం సరస్వతీదేవిని అహింసకు అధినాయికగా పేర్కొంటోంది. ధవళ మూర్తిగా పద్మంపై ఆసీనురాలై ఉన్న వాగ్దేవి మందస్మిత వదనంతో కాంతులీనుతూ ఆశ్రిత వరదాయినిగా దర్శనమిస్తుంది. మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమిగా, మదన పంచమిగా, వసంత పంచమిగా, సరస్వతీ జయంతిగా జరుపుకొంటారు. వసంత పంచమి నామాన్నిబట్టి దీన్ని రుతు సంబంధమైన పర్వదినంగా భావించాలి.
మకర సంక్రమణం తరువాత క్రమక్రమంతా వసంత రుతువు లక్షణాలు ప్రకృతిలో గోచరిస్తాయి. మాఘమాసం వసంత రుతువుకు స్వాగత గీతికను ఆలపిస్తుంది. ఆ వసంత రుతువు శోభకు ‘వసంత పంచమి’ వేడుక శ్రీకారం చుడుతుంది.
సరస్వతి శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉంది. ప్రవాహం చైతన్యానికి ప్రతీక. జలం జీవశక్తికి సంకేతం. నీరు సకల జీవరాశికి శక్తిని అందిస్తుంది. ఉత్పాదకతను పెంపొం దిస్తుంది. ఈ ఉత్పాదకత వసంత రుతువు నుంచి ఆరంభమవుతుంది. ఆ ఉత్పాదకశక్తికి ప్రతిఫలమే సరస్వతి. ఉత్పాదకుడైన, సృష్టికర్త అయిన బ్రహ్మకు శారదాదేవి శక్తిదాయిని. కాబట్టి వసంత పంచమి వసంతానికి ఆరంభ సూచకమైతే, ఈ రోజున సరస్వతీ పూజను నిర్వహించుకోవడం సహేతుకం. ఉత్తర భారతంలో ఈ పూజను అత్యంత వైభవంగా జరు పుకొంటారు. ఈ పర్వదినానికే శ్రీ పంచమి అని కూడా పేరు. శ్రీ అంటే సంపద. జ్ఞాన సంప త్ప్రద అయిన సరస్వతిని ఈరోజున పూజించడం విశేష ఫలప్రదమని చెబుతారు.
శ్రీ పంచమినే రతి కామ దమనోత్సవంగా వ్యవహరిస్తారు. మాఘ శుక్ల పంచమినాడు రతీదేవి కామదేవ పూజ చేసినట్లు పౌరాణికులు చెబుతారు. రుతురాజు అయిన వసంతానికి కామదేవునికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. వసంతుడు సస్యదేవత, కాముడు ప్రేమదేవత, రతీదేవి, అనురాగ దేవత, ఈ ముగ్గురినీ వసంత పంచమినాడు పూజిం చడంవల్ల వ్యక్తుల్లో పరస్పర ప్రేమానురాగాలు పరిఢవిల్లుతాయనే లోకోక్తి కూడా ఉంది. అలాంటి ఎన్నో అంతర్యాల సమ్మేళనమే వసంత పంచమి పర్వదినం.
ఈ రోజు ”యాదేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా” అంటూ సకల విద్యాస్వ రూపిణి అయిన సరస్వతీదేవిని అర్చించాలని బ్రహ్మవైవర్త పురాణం ఆదిగా ఎన్నో పురాణా లు తెలియజేస్తున్నాయి.
మాఘ శుక్ల పంచమ్యాం విద్యారంభే దినేపి చ
పూర్వేహ్ని సమయం కృత్యా తత్రాహ్న సంయుత: రుచి:||
వసంత పంచమిరోజు ప్రాత:కాలంలో సరస్వతీదేవిని అర్చించి విద్యారంభం చేయా లని శాస్త్ర వచనం. ఈరోజు మహాగణపతిని షోడశోపచారాలతో పూజించి శ్రీ సరస్వతీదేవి ప్రతిమతోపాటు జ్ఞానానికి ప్రతీకలైన పుస్తకాలను, పెన్నులను పూజాపీఠంపై ఉంచి అష్టోత్తర పూజ చేయాలి. సరస్వతీదేవిని తెల్లని పుష్పాలతో, సుగంధ ద్రవ్యాలతో, చందనంతో పూజిం చి, తెల్లని వస్త్రాన్ని సమర్పించాలి. నైవేద్యంగా తెల్లగావుండే రవ్వ వుండలను (పంచదార, రవ్వతో చేసి) నైవేద్యంగా అర్పించాలి. పూర్వకాలంలో రాజాస్థానాలలో వసంత పంచమి రోజు దర్బారులు నిర్వహించేవారు. కవితా గోష్ఠులు జరిపి కవులను, పండితులను, కళాకా రులను సత్కరించడం ఆనవాయితీగా ఉండేది.

సరస్వతీ ఉపాసనా ఫలం

సృష్టికర్త బ్రహ్మదేవుడు పరాశక్తిని శారదామాత రూపంలో దర్శించి, ఆరాధించాడు. ఆవిడ కృపతోనే సృష్టి రచనను ఆరంభించాడు.
గాయత్రీదేవి అయిదు రూపాలలో సరస్వతీదేవి ఒకటి. యాజ్ఞవల్క్యుడు గురుశాపం వలన విద్యలను కోల్పోవడంతో సూర్యుని ఆరాధించగా, అతడు యాజ్ఞవల్క్యునికి సరస్వతీ ఉపాసన ఉపదేశించాడు. సరస్వతీదేవి కృపవలన స్మృతి శక్తిని తిరిగి పొంది మహావిద్వాం సుడు అయ్యాడు.
వాల్మీకి సరస్వతీదేవిని ఉపాసించి శ్రీమద్రామయణ రచనను చేసాడని పురాణాలు చెబుతున్నాయి. వ్యాసమునీంద్రుడు సరస్వతీదేవి అనుగ్రహం వలనే వేద విభజన చేసి, పురాణాలను ఆవిష్కరించాడని మహాభారత, భాగవ, బ్రహ్మ సూత్రాది రచనలు చేసి భార తీయ సనాతన ధర్మ వ్యవస్థకు మూలపురుషుడుగా నిలిచాడని ప్రతీతి.
తెలుగులో భాగవతాన్ని రచించిన పోతన సరస్వతీదేవి అనుగ్రహం పొందడమేకాక, ఆ గ్రంథాన్ని పొట్టకూటికోసం నరులెవ్వరికీ అంకితమివ్వనని వాగ్దానం చేసాడు.
వసంత పంచమి… వసంత ఋతువు ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ సమయంలోఓ పంట పొలాలు పచ్చగా మారడం… పువ్వులు వికసించడం ఎక్కువగా జరుగుతుంది.

సరస్వతీ కటాక్షానికై…

- Advertisement -

వసంత పంచమి రోజున ప్రతి ఒక్కరూ కొన్ని పనులు తప్పనిసరిగా చేయాలని పండి తులు పేర్కొన్నారు. అదే మన పురాణాలు కూడా చెబుతున్నాయి. ఇలా చేయడంవల్ల సరస్వతీదేవి అనుగ్రహం కచ్చితంగా లభిస్తుందంటున్నారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు, గురుడు, శుక్రుడు, బుధగ్రహాల దోషాలు ఉండే వారు వసంత పంచమి రోజున పూజలు చేయడం వల్ల ఆ గ్రహాల ప్రతికూల ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు. ఈ రోజున సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. మద్యం, మాంసా హారానికి దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా చేయడం వల్ల సరస్వతీదేవి ఆశీస్సులు పొందడమే కాకుండా, కోరికలన్నీ నెరవేరతాయని పండితులు చెబుతున్నారు. అంతేకాదు కెరీర్‌ విషయంలోనూ మంచి విజయాలను సాధిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement