Saturday, May 18, 2024

అన్నమయ్య కీర్తనలు

రాగం : గౌరీ మనోహరి

ప|| ఏపురాణముల నెంత వెదకినా
శ్రీ పతిదాసులు చెడ రెన్నడును || ఏ పురాణముల ||

చ|| హరివిరహితములు అవిగొన్నాళ్లకు
విరసంబులు మరి విఫలములు
నరహరి గొలిచిటు నమ్మినవరములు
నిరతము లెన్నడు నెలవులు చెడవు || ఏ పురాణముల ||

చ|| కమలాక్షుని మతి గాననిచదువులు
కుమతంబులు బహు కుపథములు
జనుళి నచ్యుతుని సమారాధనలు || ఏ పురాణముల ||
విమలములేకాని వితథముగావు

చ|| శ్రీ వల్లభుగతి జేరనిపదవులు
దావతులు కపట ధర్మములు
శ్రీ వేంకటపతి సేవించు సేవలు
పావనము లధికభాగ్యపు సిరులు || ఏ పురాణముల ||

Advertisement

తాజా వార్తలు

Advertisement