Sunday, May 5, 2024

మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ – అర్జున్ గా అల‌రించాడా – అశోక‌వ‌నంలో అర్జున క‌ల్యాణం రివ్యూ

మాస్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో విశ్వ‌క్ సేన్. ఈ నగరానికి ఏమైంది, ఫలక్‌నూమా దాస్, హిట్, పాగల్‌ వంటి విభిన్న చిత్రాల్లో నటించి మెప్పు పొందాడు. తాజాగా విశ్వక్‌ మరో కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాలో వడ్డీ వ్యాపారి అర్జున్‌ కుమార్‌గా అలరించనున్నాడు.మ‌రి ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం.

క‌థ : సూర్య పేట కుర్రాడు అర్జున్ కుమార్ అల్లం (విశ్వక్ సేన్)కు పెళ్లి వయస్సు దాటిపోతోందనే బెంగ ప‌ట్టుకుంటుంది. మొత్తానికి వలేసి, రకరకాల ప్రయత్నాలు చేసి, వేరే కులంఅమ్మాయి అయినా ఓకే చెప్పేస్తాడు. ఆ రకంగా గోదావరి జిల్లా అమ్మాయి మాధవి (రుక్సార్ థిల్లాన్)నుతో వివాహానికి రెడీ అవుతాడు. ఎంగేజ్మెంట్ కి బంధుమిత్ర సపరివారంగా అమ్మాయి ఇంటికి వెళ్తాడు. అయితే అనుకోని కారణంగా కోవిడ్ దెబ్బతో…పెట్టిన జనతా కర్ఫ్యూ లాక్ డౌన్ వల్ల అర్జున్ కుమార్ ..అతని బంధువులు అమ్మాయి ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఈ లోగా ఆ అమ్మాయి మాధవికి దగ్గర కావాలని అర్జున్ కుమార్ ప్రయత్నాలు మొదలెడతాడు. కానీ ఆ అమ్మాయి దూరం పెడుతూండటంతో ఫలించవు. సరిగ్గా పెళ్లికి ముందు లేచిపోతుంది. ఆ క్రమంలో అర్జున్ కుమార్ ఏం నిర్ణయం తీసుకున్నాడు.. అమ్మాయి వెళ్లిపోయాక కూడా వాళ్లింట్లో ఉండాల్సి రావడంతో వాళ్ల కుటుంబం ఎలా ఫీల్ అయ్యింది.. ఆఖరికి అర్జున్ కి పెళ్లి అయ్యిందా లేదా అనేది తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

విశ్లేష‌ణ : పెళ్లికు ముందు పెళ్లికూతురు లేచిపోవటం లాంటి కథలు మనకు కొత్తేమీ కాదు. అయితే అది కథలో భాగం అయితే ఏ సమస్యా లేదు. కాకపోతే అదే కథలో మెయిన్ ట్విస్ట్ అయినప్పుడే సమస్య అంతా. కథ కు కావాల్సిన సమస్యను ఈ లేచిపోవటం…పెళ్లికొడుకు ఆవేదన రొటీన్ గా మింగేస్తుంది. లాక్ డౌన్ కామెడీ..ఎంత కొత్తగా వెళ్దామనుకున్నా రొటీన్ సీన్స్ వచ్చేస్తాయి. ల‌వ్‌, ఫ‌న్ స‌హా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న ఎంట‌ర్‌టైన‌ర్ అయినా ఏదో వెలితి కనపడుతుంది. కథలో హీరో చెయ్యగలిగేమీ ఉండదు. పరిస్దితిలకు తగినట్లు రియాక్ట్ అవటమే. ఫస్టాఫ్ అయితే అయితే పరుగెత్తింది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుంది. అయితే ఆ తర్వాత ప్రీ క్లైమాక్స్ దాకా చెప్పుకోదగన సంఘటనలు ఏమీ జరగక…సెకండాఫ్ లాగినట్లు అనిపించింది.

టెక్నిషియ‌న్స్ : స్క్రిప్టు ఇంకొంత స్ట్రాంగ్ గా ఉంటే..కేవలం డైలాగులే కాకుండా సీన్స్ కూడా గుర్తుండేవి. అయితే డైలాగులు మాత్రం సినిమాని మొత్తం మోసాయి అని చెప్పాలి. స్క్రీన్ ప్లే జస్ట్ ఓకే అన్నట్లుంది. ఫార్మెట్ వదలలేదు. కొత్తగానూ వెళ్లలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. గోదావరి అందాలను బాగా తెరకెక్కించారు. .పాటల్లో ఓ ఆడపిల్ల పాట బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటర్ కాస్త ప్రేక్షకుల తరపు నుంచి చూసి సెకండాఫ్ లో ఓ అరగంట పైన తీసేయచ్చు. ప్రొడక్షన్ డిజైన్ బావుంది.

న‌టీన‌టుల న‌ట‌న‌ ..అర్జున్ కుమార్ అల్లం పాత్రలోకి విశ్వక్ సేన్ పరకాయ ప్రవేశం చేసారు. ఎక్కడా అతి అనిపించలేదు. అతనిలో ఉన్న మంచి నటుడు చాలా చోట్ల కనపడతాడు. ఎమోషన్ సీన్స్ లో అండర్ ప్లే చేసి ఆశ్చర్యపరుస్తాడు. రుక్సార్ జస్ట్ ఓకే అంతే. రుక్సార్ చెల్లెలు పాత్రలో కనిపించిన రితికా నాయక్ బాగుంది ..వెన్నెల కిశోర్ ఒక్క సీన్ లో అయినా బాగా నవ్వించారు. తమిళ హీరో అశోక్ సెల్వన్ గెస్ట్ రోల్ లో కనిపించారు. కాదంబరి కిరణ్, గోపరాజు రమణ వంటివారు సినిమాని ఎక్కడా బోర్ కొట్టకుండా లాక్కెళ్లిపోయారు. ఫోటోగ్రాఫర్ పాత్రలో, గోదావరి యాసతో రాజావారు రాణిగారు ఫేమ్ రాజ్ కుమార్ చాలా బాగా చేసారు.ఓవ‌రాల్ గా ఓకే..సినిమాని చూడొచ్చు అనే టాక్ వినిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement