Tuesday, May 7, 2024

తెలంగాణ రాష్ట్రంలోనే ఆలయాలకు మహర్దశ: మంత్రి ఇంద్రకరణ్

తెలంగాణలో ఆలయాలకు మహర్దశ వచ్చిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా అనంతపెట్ గ్రామంలో రూ.38 లక్షల దేవాదాయ శాఖ నిధులతో నిర్మించిన శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి నూతన ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మంత్రికి అర్చకులు, మహిళలు పూర్ణ కుంభం, మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం నూతన ఆలయంలో నిర్వహించిన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ఆయన పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే రాష్ట్రంలోని ఆలయాలు అభివృద్ధికి నోచుకున్నాయని పేర్కొన్నారు. అనంతపేట గ్రామంలో రూ. 38 లక్షలతో ఆలయాన్ని అద్భుతంగా నిర్మించామని అన్నారు. పక్కనే బంగల్ పేట మహాలక్ష్మి ఆలయాన్ని రూ.5 కోట్లతో నిర్మిస్తున్నామని, 70 శాతం పనులు పూర్తయ్యాయని అన్నారు. లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం పక్కనే రూ. 4 కోట్లతో కేజీబీవీ విద్యాలయాన్ని నిర్మిస్తున్నామన్నారు. అలాగే గ్రామంలోని భీమన్న ఆలయం, శివాలయానికి రూ. 10 లక్షల చొప్పున కేటాయించామన్నారు.

జంగల్ హనుమాన్ ఆలయానికి రూ.50 లక్షలు, పెద్దమ్మ తల్లి ఆలయానికి 15 లక్షల నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. అనంతరం కేజీబీవీ పాఠశాలను ఆయన సందర్శించారు .పనులు త్వరగా పూర్తి చేయాలని విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ విజయ లక్ష్మి, లైబ్రరీ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, ధర్మజి రాజేందర్, మండల కన్వీనర్ గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement