Wednesday, November 29, 2023

అన్నమయ్య కీర్తనలు : ఏమి చెప్పేది

రాగం : రంజని

ఏమి చెప్పేది యీశ్వర మాయలు
దీము ప్రతిమకును త్రిజగము కలిగే||

- Advertisement -
   

మల మూత్రంబుల మాంసపు ముద్దకు
కులగోత్రంబుల గురి కలిగే
తొలులు తొమ్మిదగు తోలు తిత్తికిని
పిలువగ పేరును పెంపును కలిగే||

నెత్తురు నెమ్ముల నీరు బుగ్గకును
హత్తిన కర్మములటు కలిగే
కొత్త వెంట్రుకల గుబురుల గంతికి
పొత్తల సంసార బోగము కలిగే ||

నానా ముఖముల నరముల పిడుచకు
పూని సిగ్గుల భువి కలిగే
ఆనుక శ్రీ వేంకటాధిపు డేలగ
దీనికి ప్రాణము తిరముగ కలిగే||

Advertisement

తాజా వార్తలు

Advertisement