Saturday, October 5, 2024

Governor Rejected : నామినేటెడ్‌ కోటా ఎమ్మెల్సీలు.. మంత్రి మండలి సిఫార్సులను తిరస్కరించిన గ‌వ‌ర్న‌ర్

హైదరాబాద్‌: నామినేటెడ్‌ కోటా ఎమ్మెల్సీల పేర్లను తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తిరస్కరించారు. నామినేటెడ్‌ కోటాలో తెలంగాణ మంత్రి మండలి సిఫార్సు చేసిన పేర్లకు గవర్నర్‌ తమిళిసై ఆమోదం తెలుప‌లేదు.. కెసిఆర్ మంత్రి మండలి కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌ పేర్లను సిఫార్సు చేసింది. అయితే వారిని నామినేట్ చేసేందుకు గ‌వ‌ర్న‌ర్ అంగీక‌రించ‌కుండా వాటిని తిర‌స్క‌రించారు..

వీరిద్దరి పేర్లను తిరస్కరించడానికి గల కారణాలను కూడా ఆమె చెప్పారు. దాసోజు, కుర్రాలు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారని పేర్కొన్నారు. అలాగే వారు ఎలాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లుగా వెల్లడి కాలేదన్నారు. నామినేటేడ్ పోస్ట్ లకు నిర్ధారించిన అయిదు రంగాలలోనూ ఈ ఇద్దరు అభ్యర్ధులులేరని గవర్నర్ పేర్కొన్నారు.గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నవారిని సిఫార్సు చేయాలని సూచించారు. అటువంటివారి పేర్లను పంపితే ఆమోదిస్తానని తమిళి సై తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement