Wednesday, May 22, 2024

అన్నమయ్య కీర్తనలు : అరసి

అరసి వేరొకచో ముక్తడుగగవలదు
సారపులౌకిక విమోచనమే ముక్తి

మొగిబుణ్య పాపవిముక్తియే ముక్తి
వెగటు బ్రపంచపు విముక్తే ముక్తి
తగులు సంసారబంధవిముక్తే ముక్తి
జగములో గలుగుయాశాముక్తే ముక్తి

కామక్రోధాదిసంగ విముక్తే ముక్తి
వేమారు రుచులపై విముక్తే ముక్తి
నాముల దేహాభిమానపుముక్తే ముక్తి
పామెడి కోరికల సంపదముక్తే ముక్తి

ముందువెనకల కర్మమోచనమే ముక్తి
అంది సుఖదు:ఖభయముక్తే ముక్తి
కందువ శ్రీ వేంకటేశుగని యందే శరణని
విందుల నితరసేవావిముక్తే ముక్తి

Advertisement

తాజా వార్తలు

Advertisement