Thursday, May 16, 2024

ఆధ్యాత్మిక సాధనలు- సత్ఫలితములు

ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీ: సమా:
శుచీనాం శ్రీమతాం గేహ యోగభ్రష్టోభిజాయతే
(భగవద్గీత 6వ అధ్యాయం 41వ శ్లోకం)

ఓ అర్జునా, యోగహష్టుడైనవాడు పుణ్యజీవులు వసించు పుణ్యలోకములయందు అనేకానేక సంవత్సరములు సుఖముల ననుభవించిన పిమ్మట పవిత్ర కుటుంబమున గాని లేదా శ్రీమంతుల గృహమున కాని జన్మించును. గీతాచార్యుడు యోగ సాధన ప్రాశ స్థ్యాన్ని బోధించే సమయంలో అర్జునుడికి ఒక సం శయం కలిగింది. కొన్ని అనివార్య కారణా ల వలన ఒక సాధకుడు ఆధ్యాత్మిక మార్గం నుండి వైదొలగినట్లయితే అతడు ఆధ్యాత్మి క జయము- లౌకిక జయము రెండింటినీ పొందనివాడై, రెండింటికి చెడిన రేవడిలా అయితే ఇక అతని పరిస్థితి ఏమిటి?
ఈ ఉభయ భష్టత్వం నుండి తప్పిం చుకోవాలంటే మార్గం ఏమిటి అన్న సంశ యాన్ని శ్రీకృష్ణుడి ముందు వుంచగా, దానికి శ్రీకృష్ణుడు పై శ్లోకం ద్వారా చక్కని వివరణ, ఆధ్యాత్మికతను నమ్ముకున్న వారెవరూ ఎన్నటికీ చెడిపోరని అభయం కూడా ఇచ్చారు. ఆధ్యాత్మిక జీవితంలో కృతకృత్యులు కానివారిని శాస్త్రం రెండు విధాలుగా విభజించింది. కొద్దిపాటి పురోగతి తర్వాత పతనం పొందేవారు, అంటే సాధన ఆపివేసిన వారు. రెందవ తరగతి ఆధ్యాత్మిక సాధనను తీవ్రంగా చేసిన పిమ్మట మార్గం నుండి మరలినవారు. మొద టి వర్గం మరణానంతరం కొంతకాలం పుణ్య లోకాలలో ప్రవేశించుటకు, అక్కడ కొంతకా లం నివసించేటందుకు అర్హత సాధిస్తారు. వారి భౌతిక కోరికలన్నీ తీరిన తర్వాత తిరిగి మరు జన్మలో తమ ఆధ్యాత్మిక సాధనను పున:ప్రారంభిస్తారు. రెందవ వర్గం వారు తమ ఆధ్యాత్మి క సాధన మధ్యలోనే ఆపివేసి యోగ భ్రష్టులైనందున వారు పుణ్యలోకాలలో తమ పుణ్యం వున్నంతవరకు నివశించి, తిరిగి భూలోకమునకు పంపబడి అక్కడ ఒక పవిత్రమైన కుటుం బంలో జన్మిస్తారు. వారి పూర్వజన్మ సంస్కారంతో ఆ కుటుంబంలో చక్కని ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడి తమ సాధనను కొనసాగించగలుగుతారు. ఈవిధంగా యోగ భ్రష్టు లైన వారికి కూడా తిరిగి సాధన కొనసాగించగలిగే అవకాశం భగవంతుడు ప్రసాదిస్తున్నా డు. ఈ అవకాశం ఇంక ఏ ప్రాణికీ కల్పింపబడలేదు. అయితే ఆధ్యాత్మిక సాధనలో ప్రవేశిం చినవారు ఎటువంటి భౌతిక ఆకర్షణలకు గురికాకుండా శాస్త్రం హచ్చరిస్తోంది. రెందవ వర్గం వారికి నూతన జీవితారంభం నుండే అంటే శిశువు దశలోనే ఆధ్యాత్మిక ప్రోత్సాహం లభిస్తుంది. మొత్తం మీద ఆధ్యాత్మిక ప్రయత్నాలు వ్యర్ధంకావని. ఎన్ని జన్మలకైనా అవి సత్ఫలితా లనిస్తాయని భగవానుడు మరొకసారి అభయం ఇస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement