Monday, May 6, 2024

ఆద్యశక్తి జగన్మాత

శ్లో|| గిరా మాహుర్దేవీం దృహణ గృహణీ మాగమవిదో|

హరే: పత్నీం పద్మాం హర సహచరీ మద్రితనయాం|

తురీయా కాపి త్వం దురధి గమనిస్సీమ మహమా|
మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహషి|

సౌందర్యలహరి”లోని శ్లోకంలో జగన్మాతాంశములను గూర్చి శ్రీ శంకరాచార్యుల వారు ఇలా వివరించారు. ”ఆదిశక్తీ! నిన్ను వేదాంత వేత్తలు సర్వలోక పితామహు ని ప్రియురాలువైన వాగీశ్వరినగు మహాసరస్వతివిగా, మాధవ మనహరియైన మహా లక్ష్మివిగా, శ్రీ శంకర పత్నియైన పర్వతరాజ కుమారియైన పార్వతిగా పేర్కొంటారు. నీవు ఇంకా ఈ మువ్వురికన్నా వేరై నాల్గవ దానివై, అనిర్వచనీయమైన మహమాన్వితమైన మహా శక్తి సంపన్నురాలవై, మూలాధారమై ఈ జగత్తును భ్రమింపజేయుచున్నావు.”
అరవిందులు పాండిచ్చేరిలోని అరవిందాశ్రమంలోని ‘మదర్‌’ గురించి, మహశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి రూపా లకు ఆద్యశక్తిగా వర్ణించారు. ”ఆమె సువర్ణ వారధి, మహాద్భుత వహ్న, దైవమానసం, పరమేశ్వరాం తర్గ త నిశ్శబ్దశక్తి” అని ‘అమ్మ’ గురించి ‘సావిత్రి’ మహాకావ్యంలో అభివర్ణించారు.
”శ్రీరామచంద్రమూర్తి మహావిష్ణువు అవతారమని వశిష్టుడు చెప్పేవరకు దశరథ మహారాజు ఆయనను తన కుమారుడు అనే అనుకున్నాడు. అలాగే అరవిందుల బోధనలవలనే ఆ ‘అమ్మ’ ఆది పరాశక్తి అని మనందరం తెలుసుకోగలుగుచున్నాము.
ముందుగా మనం శ్రీ అరబిందో ఆశ్రమం సింబల్‌ అయిన శ్రీమాత చిహ్నం గురించి తెలుసుకుందాము.
శ్రీమాత సంకేతము మధ్యలో వున్న కేంద్ర వలయం అదితి మాతృకు ప్రతీక, అదితి దేవతలకు తల్లి ీndు d|d ఈుn-ుష అదితి మాతను పరివేష్టించి ఉన్న నాలు గు మూర్తులు. మహశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి, సరస్వతి.
ఈ నాలుగు శక్తులను చుట్టివున్న పన్నెండు దళములు- శ్రీ మాత కార్యమునకై అవతరించిన పన్నెండు విశిష్ట లక్షణములను తెలు పుచున్నది. అదితి నుండి వెలువడిన నాలుగు మహాశక్తులు సృష్టినం తటినీ పాలిస్తాయి.అవే నాలుగుదళాలకు ప్రముఖమైన అమ్మ నాలుగు మూర్తులు.
మహశ్వరి: మహారాజ్ఞి మహశ్వరి నాలుగు విభూతలలోనూ పెద్ద ది. జ్ఞానమూర్తి స్వరూపమే మహశ్వరి. మన ఆలోచనా మనస్సుకు, ఇచ్ఛకు పైగా ఉన్న విశా లత్వంలో ఆశీనురాలై ఉన్నది. మహోన్నత స్థితికి చెందినది, విస్తార విశ్వగతులకు, పరమ ప్రకాశ మహత్వానికి, అద్భుత భాండాగారానికి, మనల్ని చేర్చగలిగినది మహశ్వరి, ఆమె పరమ ప్రశాంతమూర్తి, ఎల్లవేళలా, అద్భుతముగా, మహనీయముగా, స్థిరముగా వుంటుం ది. సమస్త వివేకము ఆమెలో ఉన్నందుచేత ఏదీ ఆమెను కదిలించలేదు. సమస్త విషయము లను, సర్వ జీవులను, వారి స్వభావాన్ని నడిపించే ది మహశ్వరి. దేనినైనా ఎదుర్కొని స్వాధీ నం చేసుకోగల గొప్పశక్తి ఈమెలో ఉన్నది. విస్తారమైన ఆమె అనంత జ్ఞానమునకు, గొప్ప ప్రశాంత శక్తికి వ్యతిరేకముగా ఎవరూ విజయం సాధించలేరు. ఈమె సర్వాతీతమైనది, ఈ విశ్వమునందు ఈమెకు ఎట్టి బంధనాలు. లేవు. అయినా ఆమె అందరికన్నా ఎక్కువగా సు విశాల విశ్వ మాతృ హృదయము కలది. ఈమె దృష్టియందు సర్వులు ఈమె బిడ్డలే.
మహాకాళి: మహాకాళిది వేరొక స్వభావము, ప్రత్యేకించి వ్యక్తిగత విభిన్న ప్రకృతి గల ది, మహాకాళిలో విశాలత్వం వుండదు కానీ ఔన్నత్యంతో వుంటుంది. ఈమెలో వివేకము ఉండనప్పటికీ, అనంతమైన బలము ఉంటుంది. ”మహాకాళిలో పొంగిపొర్లే తీవ్రత, సా ధించుట కొరకు బ్రహ్మాండమైన భావోద్రేకత, ప్రతి హద్దులను, అవరోధములను, పటాపంచ లు చేయడానికి విజృంభించే ఒక దివ్య హంసా ప్రవృత్తి ఈమెలో ఉన్నాయి.
ఆమె ఉన్నది శీఘ్రత, తక్షణం ఫలితాన్నిచ్చే ప్రక్రియ కోసం. ఆమె వదనం అసురుడికి మహాభయకరంగా, వైఖరి దైవ ద్వేషులకు ప్రమాదకరంగా, క్రూరంగా వుంటుంది. కార ణం ఆమె పోరాటం నుంచి ఎన్నడూ వెనుకంజవేయని లోక యోధురాలు, వీరమాత.
దైవకార్యంలో ఉదాసీనతను, అజాగ్రత్తను, సోమరితనాన్ని ఆమె స#హంచలేదు. అకా ల నిద్రాళువును, తారట్లాడే వాడిని తీవ్రబాధకు గురి చేయడమే కాక కొట్టి మరీ మేల్కొల్పు తుంది. జ్వాలగా పైకెగిసే ఆకాంక్ష మహాకాళీ గమనం. అధికమైన ప్రేమగల మాతృమూర్తి, యుగములు పట్టు కార్యమును ఈమె ఒక్క దినమున జేయగల ప్రతిభాశాలి. తదుపరి ఎప్పుడో సాధించుటకన్నా విజయవంత మైన ఈమె దైవీశక్తితో, పవిత్రమైన అనుగ్రహంతో, తీవ్రత వేగంతోనూ, ఎంతటి మహాకార్యములైననూ అప్పటికప్పుడే సాధించబడును.
మహాలక్ష్మి: ఇక మూడవ విభూతి మహాలక్ష్మి. ఈమె సౌందర్యమునకు, సమన్వయ మునకు ప్రతినిధి. మహశ్వరి విజ్ఞానమునకు, మహాకాళి మాతృశక్తికి ప్రతినిధులు. ప్రజల హృదయములను ఎక్కువగా ఆకర్షించే దివ్యశక్తి రూపం మహాలక్ష్మిది, మహశ్వరి చాలా ప్రశాంతముగా. మహాకాళి అతి శీఘ్రమైనదిగా, భయప్రదమైనదిగా గోచరించును.కానీ అందరూ సంతోషముతో, ఆరాటంతో, మహాలక్ష్మి వైపు తిరుగుతారు. ఎందుకంటే దైవానికి చెందిన మైమరపించే మాధుర్య సమ్మోహన శక్తి ఆమె వెదజల్లుతూ వుంటుంది. ఆమెకు సమీపంగానూ, సన్నిహతంగానూ ఉండడం ఒక ప్రగాఢ ఆనందం. ఈమెనుహృదయమునందు నిలుపుకొ నుట వలన పరమానందంగానూ, పారవశ్యంగానూ, అత్యద్భుత స్థితులను పొందవచ్చును. సూర్యుని నుండి వెలుగు ప్రవహంచినట్లు ఈమెలో నుండి లావణ్యం, సౌందర్యం, వాత్సల్యం ప్రవహస్తాయి. మహాలక్ష్మి సామరస్యం, సౌందర్యంగల వాతావరణంలోనే ఉండ డానికి సమ్మతిస్తుంది. అసహ్యంగా, నీచంగా, హనంగా వుండేవి, లోభత్వము, క్షుద్రము, మలినము, మోటుతన ము వంటివన్నీ ఆమెను వెనక్కిపోయేట్లు చేస్తాయి. సన్యా సపు పేదరికం, క్రూరత్వము, ప్రగాఢ హృదయ ఉద్రేకము లను అణిచివేయుట ఆమెకు సంతోషాన్ని ఇవ్వవు. ప్రేమ, సౌందర్యం, సామరస్యంల ద్వారానే ఆమె కరుణ చూపిస్తుంది.
మహాసరస్వతి: మహా సరస్వతి నలుగురిలోనూ చిన్నది. సమగ్ర పనికి చెందిన శక్తి ఈమె, పరిపూర్ణతకు, క్రమ పద్ధతికి చెందిన మూర్తి స్వరూపము, కార్యనిర్వహణలో అత్యంత నైపుణ్యం గలదు. అత్యంత శక్తివంతమైనది, అలసట ఆయాసము లేకుండా, అమిత జాగరూ కతతో ఉంటుంది. మిక్కిలి సామర్ధ్యముతో సృష్టించి, పాలించగలిగిన శక్తి గలిగి నది. విజ్ఞాన శాస్త్రము, హస్తకౌశలం, సాంకేతిక నైపుణ్యం, మహా సరస్వతి పరిధిలోనివి.
పరిపూర్ణత కోసం శాశ్వత కాలం శ్రమించుటకు ఆమె ఎప్పుడూ సిద్ధమే. ఈమె మన అభీష్టములందు తల్లి వంటిది. ఆపదలందు మిత్రుని వంటిది. నిరంతరం ప్రశాంతహత బోధకురాలుగా, తన దేదీప్యమానమైన దరహాసంతో విషాదం, చికాకు, నిస్పృహ అనే మబ్బులను పారద్రోలును, మహాసరస్వతి శక్తి సృష్టిలోని అతి సూక్ష్మ విషయమును కూడా శ్రద్ధ వహంచి నిర్మాణము చేయును. ఆమె పరిపూర్ణతకు అధిష్టాన దేవత.
శ్రీమాత మనతోనూ, ఈ ప్రపంచంతోనూ ప్రత్యేకించి ఈ నాలుగు విభూతుల ద్వారా వ్యవహరిస్తుంది. దివ్యమాతలో పూర్ణత్వము, జ్ఞానము, శక్తి, ఆనందములకు ఆటపట్టు అయిన నాలుగు శక్తులు ఇమిడి ఉన్నవి. ఆ మహనీయ, మధురమూర్తియైన మాత లోకాతీ తమై, పరమ శ్రేష్టుడైన జీవునకు, సృష్టి సంబంధమొనర్చుచున్నది. సమస్తము ఆ జగన్మాత విలాసమే! శ్రీమాత ఏకైక దివ్యశక్తి. ఆమె దర్శన భాగ్యమే జీవిత లక్ష్యము. ఆమె నడకయే సమస్త లోకానికి మార్గదర్శనము. మృత్యు పీడితులై అజ్ఞానాంధకార బంధురమగు ఈ ప్రపంచంలోని మానవాళికి, సత్య, జ్ఞానములను ప్రసాదించుటకై, మన యెడల అపారమైన ప్రేమ చేత ఈ పృథ్వీ తలమున అవతరించినది శ్రీమాత, ఆమెయే మీరాంబ. ఆమెయే జగ న్మాత, ఆమెయే పరాశక్తి! అతి మానసశక్తి! ఆమె మహత్తర శక్తులతో విరాజిల్లుతున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement