Tuesday, May 7, 2024

శాశ్వతమైన సంతోషము (ఆడియోతో…)

మనసు మరియు ఇంద్రియాలు శీతలమైన, ప్రశాంతంగా ఉన్నప్పుడు అవినాశి సంతోషము కలుగుతుంది. ఆ స్థితిలో ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది. మనం కర్మలు చేస్తున్నప్పటికీ కోరికలకు దూరంగా, చేస్తున్న పని మీద మోహము లేకుండా ఉంటాము. అటువంటి సంతోషము ఎటువంటి బాధనైనా సమాప్తం చేస్తుంది. ఎవరైనా నా దగ్గరకు బాధతో వస్తే వారి బాధను కూడా నేను తొలగించగలుగుతాను. అలా నా చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇందుకు కొంత సమయం పట్టింది. కానీ ఖచ్చితంగా జరిగి తీరింది.

శాశ్వతమైన సంతోషము అంటే మనతోపాటు ఎప్పటికీ ఉండే సంతోషము. ఎంతగా అంటే ఒకవేళ ఆ సంతోషము పోతున్నట్లుగా అనిపించినా కానీ కేవలం స్మృతిని నెమరు వేసుకుంటే సరిపోతుంది. నేను ఈ ఆధ్యాత్మిక చదువును ప్రారంభించక ముందు నేను ఏ స్థితికి చేరుకున్నానంటే నా జీవితంలో సంతోషమనేది పూర్తిగా మాయమైపోయింది. నాలోని సంతోషాన్ని తిరిగి మేల్కొల్పాలి అన్న ఆలోచన నాకు వచ్చింది. ఈ రోజు మళ్ళీ అక్కడికే వచ్చాను, నా అవినాశి సంతోష అనుభూతులు నాతో ఉన్నాయి.

-బ్రహ్మాకుమారీస్‌.
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement