Sunday, May 19, 2024

భగవంతుడొక్కడే

వేదాలు, ఉపనిషత్తులన్నీ ఒక్కడే. భగవంతుడు మరి వేరే ఇతరమైనది ఏదీ ఈ లోకంలో లేదు అని అన్నాయి. అందుకు ఉదాహరణగా శివుని యొక్క రూపం విష్ణువులో విష్ణువు యొక్క రూపం శివునిలో, శివుని యొక్క హృదయంలో విష్ణువు, విష్ణువు యొక్క హృదయంలో శివుడు ఉంటాడని చెప్పాయి.
వాల్మీకి అవతారంగా భావించబడే గోస్వామి తులసీదాస్‌ రామ చరిత్‌ మానస్‌లో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ చెప్పిన పద్యం.
ఏక్‌ అనీహ్‌ అరూప్‌ అనామా
ఆజ్‌ సచ్చిదానంద్‌ పర్‌ ధామా వ్యాపక్‌ విశ్వరూప్‌ భగవానా
తేహీ ధరి దేహ్‌ చరిత్‌ కృత్‌ నానా దేవుడు ఒక్కడే. ఆయన నామ రూపాలు , జనన మరణాలు లేని శాశ్వతుడు. ఇష్టా ఇష్టాలు లేని ఆ పరమాత్మడు పరమానంద భరితుడు. సర్వ వ్యాపకుడు. విశ్వరూపుడు. లోక కళ్యాణం కోసం ఎన్నో అవతారాలు ఎత్తి అనేక లీలలు చూపాడు అని పద్యం భావం. భగవంతుడు అంతటా ఉన్నాడు. ఆయన లేని చోటంటూ ఎక్కడా లేదని పద్యం అంతరార్థం.
బమ్మెర పోతన భాగవతంలోని ప్రహ్లాద చరిత్రలో రాక్షస రాజైన హిరణ్యక శివుడు తన కొడుకును ప్రశ్నించిన ప్రశ్నకు సమాధానంగా ప్రహ్లాదుని నోట పలికించిన ప్రశ్నకు సమాధానంగా ప్రహ్లాదుని నోట పలికించిన పద్యం అతి మధురం.
ఇందుగలడందు లేడని
సందేహము వలదు చక్రి సర్వోపగతులందు ఎందెందు వెదికి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే.
విష్ణు మూర్తి ఇక్కడ ఉన్నాడు.
అక్కడ లేడు అనే సందేహం అక్కరలేదు. ఆయన అన్ని చోట్ల ఉంటాడు. ఎక్కడ వెతికి తే అక్కడ కనపడుతాడు. ఓ రాక్షస రాజా! ఇది సత్యం అని పద్యార్థం.
శ్రీ రామ కృష్ణ పరమ హంస సత్యం ఒకటే! అదే అనేక పేర్లతో వ్యవహరింపబడుచున్నది. అలాగే చెరువుల్లో ఉన్న నీటిని వేరు వేరు భాషలవారు వేరు వేరు పేర్లతో పిలుస్తారు. కానీ ఆ నీటి వినియోగం అందరికీ ఒకే విధంగా ఉంటుంది. భగవంతుడు ఒక్కడే కానీ, అనేకులు అనేక పేర్లలతో పిలుస్తారు. అనేక విధాలుగా ఆరాధిస్తారు అంటారు.
ప్రజా కవి వేమన దర్శనంబులు వేరు దైవంబు ఒకటే అంటూ గోవుల వర్ణంతో సంబంధం లేకుండా అవి ఇచ్చే పాలన్నీ ఒకే విధంగా ఉంటాయి. అలాగే పూవులు వేరైనా వాటితో చేసే పూజ ఒకటిగానే సాగుతుంది అని ఓ పద్యంలో చెప్పాడు.
వాగ్గేయ కారుడైన అన్నమయ్య పాడిన ప్రతి కీర్తన, లోతైన భావాలతో శ్రోతల్ని ఆలోచింప జేస్తుంది. బ్రహ్మ మొక్కటే పరబ్రహ్మ మొక్కటే అనే కీర్తనలో భగవంతుడు ఒక్కడే అని చెబుతూ చక్రవర్తి అయినా, నిరుపేద అయినా, నిద్రలో పొందే సుఖం ఒక్కటే. బ్రాహ్మణుడైనా నా దళితుడైనా ఒకే మట్టిలో కలుస్తాడు అని దైవత్వాన్ని మానవత్వంతో ముడిపెట్టి చెప్పబడింది. దేవుళ్ళు ఎందరున్నా వారి స్వరూపం , తత్వం ఒకటేనని , ఓం కారం ఒక్కటే దైవమని సిక్కుల మత గురువు గురునానక్‌ తన గ్రంథంలో తెలిపాడు.
స్వామి శివానంద భగవంతుడు ఒక్కడే అయినా.. ఆయన నామ రూపాలు అనంతం. నీ ఇష్టం వచ్చినట్లు ఆయన్ని పిలిచి పూజించు. నీకు భగవద్దర్శనం కలుగుతుంది. భగవత్‌ కృపకు పాత్రుడవుతావు అన్నాడు స్వామి శివానంద.
భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునితో ” పార్దా, సత్పరజో సమోగుణ సంయోగ రూప మైన మాయచే నన్ను పరమ పురుషునిగా అన్ని రూపాలు నావే అని గుర్తించక వ్యవహరి స్తుంటారు. అట్టే వారికి సమయానుకూలంగా వ్యవహరిస్తూ నన్ను తెలుసుకునేట్టు చేస్తాను అన్నాడు. శ్రీ మహా విష్టువు యొక్క దశావతారాల్లో కృష్ణా పురుషునిగా అన్ని రూపాలు నావే అని గుర్తించక వ్యవహరిస్తుంటారు. అట్టే వారికి సమయాను కూలంగా వ్యవహరిస్తూ నన్ను తెలుసుకునేట్టు చేస్తాను అన్నాడు. శ్రీ మహా విష్టువు యొక్క దశావతారాల్లో కృష్ణావతారం ఎనిమిదో అవతారం. జగతులో ధర్మాక్షీణత కలిగినప్పుడు తాను అవతరిస్తానని స్వయంగా పరమాత్ముడు చెప్పాడు. ద్వాపర యుగంలో ధర్మాచరణ క్షీణత చేరుకోవడంతో మహా విష్ణవు
కృష్ణుడి అవతారం ఎత్తాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే కృష్ణుడు కొన్ని సందర్బాల్లో తన విశ్వ రూపాన్ని ప్రదర్శించాడు. శ్రీ కృష్ణుడు బాల్యంలో ఒకసారి తన విశ్వ రూపాన్ని ప్రదర్శించాడు. చిన్న తనంలో బల రాముడు యశోద దగ్గరికి వచ్చి కృష్ణుడు మన్ను తిన్నాడని చెప్పాడు.
అప్పుడు యశోద కోపంగా అడిగినప్పుడు తిన లేదని నోరు తెరిచి చూపగా యశోదకు కృష్ణుని నోటిలో విశ్వమంతా కనిపించింది.
శ్రీ కృష్ణుడు రాయబారిగా కౌరవులకు పాండవులకు పొందుపర్చడం కోసం వెళ్లినప్పుడు కృష్ణుని మాటలు ఏమాత్రం రుచించని కౌరవులు, ఆయన్ని బంధించాలని చూసినప్పుడు అది ముందే గ్రహించిన శ్రీ కృష్ణుడు తన విశ్వ రూపాన్ని ప్రదర్శించి కౌరవులు కండ్లు మూసుకునేట్టు చెప్పాడు. అదే సమయంలో ధృత రాష్ట్రునికి దృ ష్టి ప్రసాదించి తన రూపాన్ని చూసేటట్టు చేస్తాడు. కురుక్షేత్ర యుద్దం ప్రారంభ సమయాన యుద్దం చేయలేనని చతికిలపడ్డ అర్జునునికి తన విశ్వ రూపం చూపి కార్యోన్ముఖుల్ని చేసాడు. ఉదంతమునికి, దేవకీ వసుదేవులకు తననిజస్వరూపాన్ని చూపాడు.
అన్ని మతాలవారు నేడు భగవంతుడు ఒక్కడేనని నమ్మకం కోల్పోవడం వల్లే భిన్న మతాల్లో చిచ్చు రేగి దేశ ఐక్యతా భావం దెబ్బతిని కొన్ని మతాలవారు తమ మాతృదేశాన్ని పరాయి దేశం గా చూస్తున్నారు. ఇలాంటి భావన దేశ సమైక్య తకు గొడ్డలిపెట్టని భావిస్తున్నారు.


పరికిపండ్ల సారంగపాణి
9849630290

Advertisement

తాజా వార్తలు

Advertisement