Saturday, April 27, 2024

బ్రహ్మాకుమారీస్‌.. నిశ్చింత జీవితానికి సువర్ణ సిద్ధాంతములు (ఆడియోతో..)

స్మృతి : ”నేను ఈ భూమి పై విశేషకార్యార్థం నిమిత్తమైన ఆత్మను”
లక్ష్యం : వ్యవహారంలో శుద్ధత, సత్యత, దివ్యత కలిగి ఉంటాను.
(బ్రహ్మ ముహూర్తంలో కళ్ళు తెరవగానే ఒక దివ్యమైన ప్రకాశమయమైన, తేజోవంతమగు శక్తి కలిగిన నక్షత్రం పరంధామం నుండి దిగి ఈ శరీరమనే మందిరంలో ప్రవేశించి మస్తకం మధ్య స్థానంలో ఉన్నట్లుగా అనుభవం చేసికొనంది)
చింతన : నేను ఈ భూమిపైన ఒక విశేషకార్యార్థం అవతరించిన ఆత్మను.. నేను సుఖ శాంతి పవిత్రతామూర్తిని.. నేను తీసికొనేవాడను కాను. కానీ నేను దేవతను.. కలియుగం యొక్క ఈ అంతిమ సమయంలో.. సృష్టిలోని జీవాత్మలందరూ దు:ఖంగా అవాంతిగా ఉన్నారు.. వీరందరికీ శాంతి వరదానం ఇచ్చే ఆత్మను.. నేను. శాంతి దేవతను.. శాంతి సాగరుని ఛత్రఛాయను పొందిన నేను మాస్టర్‌ శాంతిసాగరుడను.. శాంతి నా నిజస్వభావం.. శాంతి, ప్రేమ, ఆనంద స్రోతస్విని.. పరమపిత పరమాత్మ శివబాబా నా తండ్రి.. ఆయన నుండి సర్వగుణాల ప్రవాహం నాపై నిరంతరమూ పడుతూ ఉన్నది…నాకు లభించేదంతా ఇతరులకు పంచడం కోసం.. నేను అంజలి ఘటించే హస్తాలతో ఇదంతా పొందుచున్నాను.. నా నయనాల నుండి.. ముఖ మండలం నంఉడి.. అదరికీ సుఖశాంతి అనుభూతి కలుగుచున్నది.. నా హస్తాలతో మహత్తర కార్యం జరుగుచున్నది..
అభ్యాసం : రోజంతా ఇదే స్మృతిలో ఎల్లరికీ సుఖశాంతి మార్గం ప్రభోదించే ”లైట్‌ హౌస్‌’ అయి ఉండాలి.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement