Sunday, May 19, 2024

ప్రశాంతతే అసలు కిటుకు

ఏ వ్యక్తికైనా ప్రశాంతత చాలా ముఖ్యం. ప్రశాంతత ఉంటేనే మనసు స్థిరంగా ఉంటుంది. మానవుడు ఇంద్రియ నిగ్రహం కోల్పోక తన అధీనంలో ఉంచుకుని రాగద్వేషాలకు అతీతుడై విషయ వస్తువుల మధ్య సంచ రిస్తూ ఉన్నట్టయితే మనసు తన ప్రశాంత తను కోల్పోక స్థిరంగా ఉంటుంది. అప్పుడు ఎన్ని బాధలైనా, దు:ఖములైనా బండ రాయిని ఢీకొన్న అల వలె నిష్ప్రయోజనం అవుతాయి. ఆ సమయంలో సాధకుని బుద్ధి స్థిరమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేయ గలగాలి. దీన్ని మరో కోణంలో నుంచి చూసి ఆలోచిస్తే దు:ఖమంటే చెడు వాసనల ఫలితమే. ఒక వ్యక్తి ఈ జన్మలో దు:ఖం అనుభవిసు ్తన్నాడంటే అది పూర్వ జన్మలో చేసిన పాప కార్యాల ఫలితమే. భారతీయ జీవన సరళిలో సంతోషం, ఆనందం, సుఖం ఇవన్నీ మానవునికి అత్యావశ్యకాలే అవుతున్నాయి. మానవుడు ఎన్ని సుఖ సాధనాలను ఏర్పాటు చేసుకున్నా అతని అంతరంగం కల్లోలిత మయితే ఏమి లాభం? కొందరు ఎన్ని విధాలైన అధునిక సాధనాలు పడకగదిలో ఏర్పాటు చేసుకునినిద్రిస్తున్నా నిద్ర కోసం మందుల మీద ఆధారపడినా ఫలితం ఉండదు. మరో పక్క ఎందరో పేదలు పక్కన దేవాల యాల మెట్ల మీద పడుకుని ఏ చీకూ చింతా లేకుండా హాయిగా నిద్రపోతుం టారు. అందుకే మనసు ప్రశాంతంగా ఉంటే సుఖం కలుగుతుంది. ప్రశాంత మనసుతో స్థిర నిర్ణయాలు తీసుకుంటు జీవితం ఒడిదు డుకులు లేకుండా ప్రశాంతంగా సాగుతుంది. సంసార నావ సుఖ సంతోషాలతో ఉంటుంది. లేకుంటే సముద్రంలో పెనుగాలికి నశించే నావలాగా నశించిపోతుంది.

కనుమ ఎల్లారెడ్డి
93915 23027

Advertisement

తాజా వార్తలు

Advertisement