Sunday, May 19, 2024

పెద్దశేష వాహనంపై మళయప్పస్వామి

తిరుమల, ప్రభ న్యూస్‌ : నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు పెద్ద శేష వాహనం పై భక్తులను కటాక్షించారు. రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ స్వామి, అమ్మవార్లు తిరుమాడవీధుల్లో దర్శన మివ్వగా పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. సర్పరాజైన ఆధిశేషువు జగన్నాథునికి నివాసభూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీవేంకటేశ్వ రస్వామి సహస్రనామాలతో సేషసాయి. శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్య పూజలందుకుంటున్నారు. అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావ తారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆధిశేషువు శ్రీవైకుంఠంలోని నిత్యసూ రులలో అధ్యుడు. ఈ విధంగా స్వామి వారు దాస భక్తికి మారురూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీఆదిశేషుని పై ఉభయ దేవేరులతో కూడి ఊరేగుతూ భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగతి ప్రపత్తిని కూడా సాక్షాత్కరించ చేస్తున్నాడు. అందుకే స్వామివారు బ్రహ్మోత్సవ వాహన సేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆధిశేషునికే ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటిఈవో రమేష్‌బాబు, పేష్కార్‌ శ్రీహరి, విజివో బాలిరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement