Thursday, May 16, 2024

ధర్మం – మర్మం : కార్తిక శుక్ల చతుర్దశి (ఆడియోతో…)

కార్తిక శుక్ల చతుర్దశి గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ

కార్తిక శుక్ల చతుర్దశిని వైకుంఠ చతుర్దశిగా కూడా వ్యవహరిస్తారు. ఈ చతుర్దశి శివకేశవుల ఇరువురికి ప్రియమైనది. ఈనాడు ఉపవసించి శ్రీహరిని పూజించిన ఇంద్రియ జయం పొందవచ్చును. దీనినే మహాదేవ చతుర్దశి అని కూడా పేరు. ఇది విశ్వేశ్వర ప్రతిష్ఠా దినం.

వర్షేచ వర్షేచ విలంబి మాసి శ్రీమతి కార్తికే
శుక్లే పక్షే చతుర్దశ్యామ్‌ అరుణాభ్యుదయం ప్రతి మహాదేవ తిథౌ
బ్రాహ్మీ ముహూర్తే మణికర్ణికే స్నాత్వా
వి శ్వేశ్వరౌ దేవ్యా మనసా అపూజయత్‌

అని స్కాంద పురాణ ం మరియు సనత్‌కుమార సంహిత వచనం. విలంబి సంవత్సర కార్తిక శుక్ల చదుర్దశి నాడు అరుణోదయమందు మహాదేవ తిథిగా వ్యవహరిస్తారు. ఈనాడు బ్రహ్మీ ముహూర ్తంలో వారణాసిలో నున్న మణికర్ణికలో స్నానమాచరించి దేవితో కూడిన విశ్వేశ్వరుడు విశ్వేశ్వరుని అనగా శ్రీమన్నారాయణుని పూజిస్తాడు. కావున ఈనాడు బ్రాహ్మీ ముహూర్తంలో మణికర్ణికలో స్నానమాచరించి విశ్వేశ్వరులిద్దరినీ (శివకేశవులు) పూజించినచో సకల ఇష్ట ప్రాప్తి, అనిష్ట నివృత్తి జ రిగి ముక్తి పొందవచ్చు. ఈనాడు ఉపవసించి మర్నాడు బ్రాహ్మీ ముహూర్తంలో విమల తీర్థంలో స్నానమాచరించి దండపాణి(యముడు)కి మహాస్థాన రూపమైన ఈ వనమందు పారణ చేస్తే పరమార్థ జ్ఞానం కలుగుతుందని శివరహస్యం ద్వారా తెలుస్త్తోంది. ఇక్కడి శివారాధకులు అరుణోదయ కాలం లో మణికర్ణికలో స్నానమాచరించి పిదప భస్మ స్నానం చేసి సంధ్యావందనాది నిత్యకృత్యములు పూర్తిచేసుకుని శంకరుని పూజించి భక్తులకు సంతర్పణచేసినచో సకల అభీష్టాలను పొందుతారు.

పద్మ పురాణానుసారం కార్తికమాస వ్రతము ఆచరించేవారు ఈ చతుర్దశి నాడు ఉద్యాపన చేయాలి. తులసీ వృక్షం సమీపాన మండపం నిర్మించి తులసీమూల దేశంలో సర్వతోభద్ర మండలాన్ని లిఖించి దానిపై పంచరత్నములతో కూడిన కలశాన్ని ఉంచి వాటి మధ్యన గురువుగారి ఆజ్ఞతో బంగారంతో గాని, ఏ ఇతర లోహంతో గాని విష్ణు ప్రతిమను ప్రతిష్టించి పూజించాలి. గీత వాద్యాది మంగళములతో రాత్రి జాగారం చేయాలి. మరునాడు కార్తిక పూర్ణిమ రోజు బ్రాహ్మణ దంపతులను ఆహ్వానించి శక్తిమేరకు తిల పాయసంతో ”అతో దేవా” అను మంత్రముతో హోమం చెసి కపిల గోవును దానమివ్వాలి. గురువును యధావిధిగా పూజించి గురువాజ్ఞతో బంధుమిత్రులతో భుజించి బీదసాదలకు వస్త్రదానం చేసి స్వామిని ధ్యానిస్తూ జితేంద్రియుడై నిద్రించాలి. ఈవిధంగా వ్రతోద్యాపన చేసినచో సకలాభీష్టములు సిద్ధించి పరమపదం లభించును.

- Advertisement -

వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి
————

Advertisement

తాజా వార్తలు

Advertisement