Friday, May 3, 2024

AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ఉదయం ప్రారంభమైయ్యాయి. బద్వేల్ ఉపఎన్నికలో గెలిచిన ఎమ్మెల్యే సుధా ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల మరణించిన ఎంఎ అజీజ్‌, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే కృష్ణమూర్తి మృతి, మాజీ ఎమ్మెల్యే రంగనాయకులు, మాజీ ఎమ్మెల్యే టీ.వెంకయ్య, మాజీ ఎమ్మెల్యే వంకా శ్రీనివాసరావు మృతికి ఏపీ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. ఈ సమావేశాల్లో పెండింగ్ లో ఉన్న ఆర్డినెన్స్ లను ప్రభుత్వం సభకు మందుకు తీసుకురానుంది. మొత్తం 14 ఆర్డినెన్స్ లను ఆమోదించుకునే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది జులై నుంచి ఇప్పటివరకు వివిధ శాఖలకు సంబంధించి 14 ఆర్డినెన్సులను జారీ చేసింది. ఒకేరోజున 14 ఆర్డినెన్స్‌లను శాసనసభ, శాసన మండలి ఆమోదించేలా ప్రభుత్వం ప్లాన్‌ చేస్తోంది.

ఒక్కరోజే సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. బీఏసీలో అసెంబ్లీ సమావేశాల అజెండా, పనిదినాలపై చర్చించనున్నారు. అయితే, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై టీడీపీ విమర్శలు చేసింది. అసెంబ్లీ సమావేశాలను 15 రోజులు పొడగించాలని డిమాండ్ చేస్తోంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

 

Advertisement

తాజా వార్తలు

Advertisement