Friday, April 19, 2024

MPTC, ZPTC Elections Results: కాసేపట్లో పరిషత్ ఎన్నికల ఫలితాలు

ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. 10 జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎన్నికల అధికారులు ప్రారంభించారు. ఉదయం 10 గంటలకే ఎంపీటీసీ, మధ్యాహ్నం 12 గంటలకు జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.

మంగళవారం(నవంబర్ 16) నాడు 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల ఎన్నికలు జరిగాయి. 14 జడ్పీటీసీల్లో 04 ఏకగ్రీవం కాగా.. 10 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. 176 ఎంపీటీసీల్లో 50 ఏకగ్రీవం కాగా.. 03 స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఈ మిగిలిన 123 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 16న జరిగిన పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే.

కాగా, ఆంధ్రప్రదేశ్ లో నిన్న మున్సిపల్‌, మొన్న పంచాయత్‌ ఎన్నికల కౌంటింగ్‌ పూర్తయింది. స్థానిక సంస్థల అన్ని ఎన్నికల్లోనూ అధికార పార్టీ వైసీపీ సత్తా చాటింది. అత్యధిక మున్సిపాలిటీలను దక్కించుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement