Saturday, April 27, 2024

దేవతలను మించినవాడు కీర్తిముఖుడు

కీర్తిముఖుడు ఎంతో ప్రముఖుడు. రాక్షస జన్మ అయినా పరమశివుని అనుగ్రహం పొందాడు. ‘దేవతలను మించినవాడివి’ అని శివుడు చేత కొనియా డబడినాడు. తనను తానే తినేసుకున్న కీర్తి ముఖుని కథని కథ ఇది.
దీన్ని చదివితే కీర్తిముఖుడు దేవతలకంటే కూడా ఎందు కు గొప్పవాడయ్యాడో తెలుస్తుంది. ప్రతి గుడినీ కీర్తిముఖుని రూపంతో అలంకరిస్తారు. ఒకప్పుడు కొన్ని శక్తులు సంపాదిం చిన యోగి ఒకడుండేవాడు. అతను శివుని వద్దకు వచ్చి విసి గించే ప్రయత్నం చేస్తున్నాడు. శివుడు అతన్ని పట్టించు కోలేదు, అయినా ఆ యోగి వదలడం లేదు. శివుడు ఒకరకమై న స్థితిలో ఉన్నాడు. ఆయన మానవ రూపంలో ఒక రాక్షసుణ్ణి సృష్టించాడు. ఆ రాక్షసుడితో, శివుడు ”ఇతగాణ్ణి తినేసెయ్‌” అని చెప్పాడు. యోగి ఏం జరుగబోతున్నదీ తెలుసుకున్నాడు, శివుని పాదాలపై పడ్డాడు, ”స్వామీ! ఈ ఒక్కసారికి వదిలేయండి. మళ్లీ మిమ్మల్ని విసిగించను” అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు రాక్షసునితో శివుడు ”సరే వదిలెయ్‌” అన్నాడు. ఈ రాక్షసుణ్ణి సృష్టించిందే ఈ యోగిని తినడానికి. రాక్షసుడు ఖాళీ కడుపుతో వచ్చాడు. రాక్షసుడు శివుడుతో ”ప్రభూ! ఇతన్ని తినడానికే నన్ను సృష్టించారు, ఇప్పుడు వదిలెయ్యమంటు-న్నారు. ఇప్పుడు నేనేం చేయాలి?” అని అడిగాడు. శివుడింకా అదే మానసిక స్థితిలో ఉన్నాడు, ”ఆ..! నిన్ను నువ్వే తినేసేయి” అన్నాడు. కొంతసేపటికి పరమశివుడికి ఎవరో నములుతున్న శబ్దాలు వినిపించడం మొదలైంది. ఆయన తిరిగి చూశాడు. రాక్షసుడు తనను తాను తింటు-న్నాడు. పాదాల నుండి దాదాపు శరీరమంతా పూర్తయింది. చేతుల దాకా వచ్చాడు. చేతులను తినడానికి నోట్లో పెట్టు-కున్నాడు. శివుడు ఈ పరిస్థితిలో అతన్ని చూసి, ”ఓహ్‌. నీది కీర్తిమంతమైన ముఖం. తనను తాను ఈవిధంగా భుజించగలిగినవాడి ముఖం నిజంగా ఎంతో కీర్తి మంతం. నీవు దేవతలను మించినవాడివి.” అన్నాడు. అందువల్ల ప్రతి దేవాలయంలోనూ కీర్తి ముఖం ఉం టు-ంది. శివుడు పరాకుగా చెప్పినంత మాత్రంచేతనే అతను తన శరీరాన్ని తానే భుజించాడు. మరో కారణం లేదు, అర్థం లేదు, తినేశాడంతే. అందుకే దేవతలను మించినవాడయ్యా డు. స్థాన, కాలాలను – సర్వాన్నీ అధిగమించాడు. దేవతలను మించిపోయాడంటే, దేవతలు కూడా వీటిలో కొన్ని వాస్తవా లకు అధీనులే, కానీ కీర్తిముఖుడు ఆ కోణాలన్నిటినీ దాటి ముందుకు వెళ్లిపోయాడన్నమాట. అతను వీరందరికంటే మిన్నగా ఉన్నాడు. ఒక రాక్షసుడు యోగిని తినివేస్తే అది అంత మంచి విషయం కాదు. కాని ఎవరైనా తనను తాను తినివేయ డమన్నది అత్యద్భుతమైన విషయం. ఎందుకంటే దైవత్వం ఎవరిలోనైనా ప్రవేశించాలన్నా, అది వ్యక్తం కావాలన్నా మనిషిలో ఖాళీ స్థలం ఉండాలి. అటు-వంటి శూన్యస్థితిలో మాత్రమే మానవుడికి ప్రేమ, సంతోషం, శాంతి తెలుస్తాయి. శూన్యం ఏర్పడితేనే దివ్యత్వం కలుగుతుంది. మనిషి శారీరక, మానసిక పరిమితుల్ని, చివరికి జీవన శక్తుల్నీ అధిగమించా లంటే ఇలాగే వుండాలి. లేకపోతే ఆ కోణాలను స్పృశించను కూడా స్పృశించలేరు. ఎవరైనా సరే తమను తాము తినగలిగి తేనే కీర్తిముఖులు కాగలరు.
సేకరణ: పి.భాస్కరశర్మ

Advertisement

తాజా వార్తలు

Advertisement