Wednesday, April 24, 2024

”ధర్మం” అంటే ఏమిటి

”జీవితం అంటే పోరాటం. అలాంటప్పుడు స్వార్థం కోసమో, అధర్మం కోసమో ఎందుకు పోరాటం చేయడం? ఆ పోరాటమేదో ధర్మం కోసం పోరాడు” అన్నాడు గౌతమ బుద్ధుడు. ”నువ్వు నమ్మినవాళ్ళు మోసం చేయవచ్చేనేమో కానీ నువ్వు నమ్మిన ధర్మం నిన్ను ఎన్నటికీ మోసం చేయదు” అనేది లోకోక్తి. హిందూ ధర్మశాస్త్రం మానవ జీవితంలో వివిధ దశల్లో ఆచరించాల్సిన ధర్మాలను పేర్కొంది. అలాగే అసలు ధర్మం అంటే ఏమిటి? ఎవరు ఏ ధర్మం చేయాలి? అని తెలుసుకుందాం.

అగ్ని సాక్షిగా పెండ్లాడిన భార్యను వదిలివేయకుండా వుండటం – వివాహ ధర్మం!
తన భర్త అందహీనుడైనా, స్థితిపరుడు కాకున్నా, నమ్మివుండటం – భార్య ధర్మం!
నమ్మిన మిత్రునికి అపకారం చేయకుండటం
– మిత్ర ధర్మం!
సోమరితనం లేకుండటం – పురుష ధర్మం!
విజ్ఞానాన్ని దాచుకోకుండా బోధించటం – గురుధర్మం!
భయభక్తులతో విద్యను నేర్చుకోవటం – శిష్యధర్మం!
న్యాయమార్గంగా సంపాదించి సంసారాన్ని పోషిం చటం – యజమాని ధర్మం!
భర్త సంపాదనను సక్రమంగా పెట్టి గృహాన్ని నడపటం
– ఇల్లాలి ధర్మం!
సైనికుడుగా వుండి దేశాన్ని, ప్రజలను కాపాడటం
– సైనిక ధర్మం!
వృద్ధులైన తల్లిదండ్రుల్ని ఆదరించి పోషించటం
– బిడ్డల ధర్మం!
తాను జన్మనిచ్చిన బిడ్డల్ని ప్రయోజకుల్ని చేయటం
– తండ్రి ధర్మం!
తన ఇంటికీ, తనను కన్నవారికీ పేరుప్రతిష్ఠలు తేవటం
– బిడ్డలందరి ధర్మం!
తన వృత్తి ఎటు-వంటిదైనా వృత్తిని గౌరవించటం
– వృత్తి ధర్మం!
తీసుకున్న జీతానికి నమ్మకంగా పని చేయడం
– ఉద్యోగి ధర్మం!
తాను సంపాదించిన దాన్ని తనవారితో పంచుకొని తినటం – సంసార ధర్మం!
అసహాయులను కాపాడటం – మానవతా ధర్మం!
చెప్పిన మాటను నిలుపుకోవటం – సత్య ధర్మం!
నిత్యం సంధ్యావందనంచేయటం – ద్విజుల ధర్మం!

Advertisement

తాజా వార్తలు

Advertisement